Shruti Haasan: సలార్ టీంకి గుడ్ బై చెప్పిన శృతి హాసన్!

  • February 24, 2023 / 02:07 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో.. సలార్ మూవీ కూడా ఒకటి. ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ కూడా ఇదే. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రభాస్ గత రెండు చిత్రాలు అయిన ‘సాహో’ రాధే శ్యామ్ నిరాశపరిచాయి. ‘ఆదిపురుష్’ పై జనాల్లో అసలు ఆసక్తి లేదు. అందరి చూపు ‘సలార్’ పైనే ఉంది. అందుకోసమే ఈ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా..

అది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది. అలాంటి అప్డేట్ ఒకటి ఇప్పుడు అందింది. అది కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ గురించి. తాజాగా ఆమె ‘సలార్’ టీంకి గుడ్ బై చెప్పిందట. అదేంటి అనుకుంటున్నారా.. ‘సలార్’ మూవీలో శృతి హాసన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలో ఆమె ఆధ్య అనే పాత్రలో కనిపించనుంది.

ఇక ‘సలార్’ టీంకి గుడ్ బై చెబుతూ శృతి హాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. షూట్‌ ముగించుకున్న తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడతో కలిసి సెట్స్ లో దిగిన ఒక మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) ఫోటోని షేర్ చేసింది శృతి హాసన్.” ‘సాలార్ ఓ ప్రత్యేక చిత్రం’… నాకు ఆద్య పాత్ర ఇచ్చినందుకు థాంక్యూ ప్రశాంత్ సార్..

మీరు అసాధారణమైన వ్యక్తి.. ప్రభాస్ యు ఆర్ వెరీ లవబుల్.నాకు అద్భుతమైన కోస్టార్ గా ఉన్నందుకు థాంక్స్.. హోంబేల్ ఫిలిమ్స్ టీమ్‌లోని అందరితో కలిసి ఈ చిత్రంలో నటించడం నాకు ఆనందంగా ఉంది ” అంటూ శృతి హాసన్ రాసుకొచ్చింది. 2021 వ సంవత్సరంలో జనవరిలో సెట్స్‌ పైకి వెళ్లిన ఈ మూవీ.. 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus