నటి స్నేహా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యక్కర్లేని పేరు.. పుట్టింది బాంబేలో అయినా మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తమిళ్, తెలుగు, కన్నడంలో నటించి.. ముఖ్యంగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. హోమ్లీ ఇమేజ్‌తో తెలుగమ్మాయి అంటే నమ్మేసేలా ఉండే స్నేహా నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఓ పాప, బాబు సంతానం.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ షోలకు జడ్జిగా అలరిస్తున్నారు.. స్నేహాకు ఓ అక్క, అన్నయ్య ఉన్నారు..
అక్క సంగీత డిజైనర్.. తాజాగా స్నేహా బ్రదర్ బాలాజీ కుమార్తె.. అంటే ఆమె మేనకోడలి ఓణీల ఫంక్షన్ మైసూరులో ఘనంగా నిర్వహించారు.. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో స్నేహా ఇంకా ఆమె వదిన ఫ్యామిలీతో పాటు కొంతమంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ పాల్గొన్నారు.. అందరూ ట్రెడిషనల్ వేర్లో మెరిసిపోయారు.. బంధువులంతా స్నేహా మేనకోడిలిని బ్లెస్ చేశారు.. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..