సొనారికా మరీ ఇంత సన్నగా అయిపోయిందేమిటి!

“చక్కనమ్మ చిక్కినా అందమే” అని అంటుంటారు. అది కొందరు కథానాయికల వరకూ ఒకే కానీ.. ఆ చిక్కడం మరీ ఎక్కువైనా మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ సొనారికను చూస్తే అదే అనిపిస్తుంది జనాలకి. హిందీలో సీరియల్స్ ద్వారా వెండితెరకు పరిచయమైన సొనారిక తెలుగులో “జాదూగాడు, ఆడోరకం ఈడోరకం” చిత్రాల్లో నటించింది. రెండు సినిమాల్లోనూ సూపర్ హాట్ గా ప్రేక్షకులకు సెగలు పుట్టించిన సొనారిక కారణాంతరాల వలన “స్పీడున్నోడు” తర్వాత తెలుగులో సినిమాలు చేయనంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.

అయితే.. మొన్నామధ్య బికినీ వేసుకొని ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టినందుకుగానూ రచ్చకెక్కిన సొనారిక మళ్ళీ కొన్నాళ్లు సైలెంట్ అయిన సొనారిక మళ్ళీ విజృంబించింది. ఈసారి బికినీ ఫోటోలు కాకుండా కాస్త సెక్సీగా కనిపించే ఫోటోలు అప్లోడ్ చేసింది. అయితే.. సదరు ఫోటోల్లో సొనారిక మరీ సన్నగా దర్శనమిచ్చేసరికి ఆమె అభిమానులందరూ షాక్ అయ్యారు. సినిమాల కోసం ఇలా సన్నగా అయ్యిందా ఏదైనా డిఫరెంట్ మేకోవర్ ఏమైనా ట్రై చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus