Sreeleela: బాలయ్య గొప్పదనం చెప్పిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. శ్రీలీల ఏడాది సంపాదన 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండనుందని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో విజ్జిపాప రోల్ లో నటించిన శ్రీలీల ఈ సినిమా తన కెరీర్ లో మెమెరబుల్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు. బాలయ్య కూతురిగా భగవంత్ కేసరిలో నటిస్తున్నానని చెప్పిన వెంటనే చాలామంది భయపెట్టారని ఆమె అన్నారు.

కెరీర్ ఆరంభంలో ఇలాంటి రోల్స్ చేయవద్దని చాలామంది చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. కథ నచ్చడంతో నేను మాత్రం నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా ముందడుగులు వేశానని ఆమె తెలిపారు. ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలు అన్నిసార్లు రావని శ్రీలీల చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి నటిగా ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన అద్భుతమైన అవకాశమని శ్రీలీల అన్నారు. విజ్జి పాప ధైర్యం లేని అమ్మాయి కానీ చలాకీగా ఉంటుందని శ్రీలీల తెలిపారు.

గ్తంలో నేను పోషించిన పాత్రలతో పోల్చి చూస్తే ఈ రోల్ భిన్నంగా ఉంటుందని (Sreeleela) శ్రీలీల వెల్లడించారు. అనిల్ రావిపూడి తన స్టైల్ ను వదిలేసి చేసిన సినిమా ఇదీ అని శ్రీలీల చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి సినిమాతో నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కిందని శ్రీలీల అన్నారు. బాలయ్యతో మాట్లాడాక ఆయన మనస్సు ఏంటో అర్థమైందని ఆమె తెలిపారు బాలయ్య మనస్సుకు తగ్గట్టే బాలకృష్ణ అని పేరు పెట్టారని శ్రీలీల చెప్పుకొచ్చారు.

బాలయ్య వైద్యం గురించి ఎన్నో విషయాలను నాతో మాట్లాడారని బాలయ్య, కాజల్ మధ్య కామెడీ సీన్స్ బాగుంటాయని బాలయ్య మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని శ్రీలీల తెలిపారు. నిజ జీవితంలో నాకు చిచ్చా అంటే మా అమ్మేనని శ్రీలీల కామెంట్లు చేశారు. డాక్టర్ కావాలనేది నా బలమైన కోరిక అని శ్రీలీల చెప్పుకొచ్చారు. శ్రీలీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags