సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇంకో వీకెండ్ మిగిలుండడంతో.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ మరింత భారీగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
మొత్తంగా రీజనల్ మూవీస్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఎక్కువగానే ఉంది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫలితం కమర్షియల్ గా బాగున్నప్పటికీ… కంటెంట్ పరంగా మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా సంక్రాంతికి కాకుండా వేరే టైంలో రిలీజ్ అయ్యుంటే డిజాస్టర్ అయ్యేదని.. ‘విశ్వాసం’ కథనే అటు తిప్పి ఇటు తిప్పి తీశారని చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేశారు.అలాగే వెంకటేష్ ‘బాడీ గార్డ్’ సినిమా పోలికలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ విమర్శలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. “ఈ సినిమా సంక్రాంతికి కాకుండా వేరే టైంకి సోలో రిలీజ్ చేస్తే ఇంకా ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి.. ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది.ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో ‘విశ్వాసం’ ఛాయలు కూడా ఉన్నాయి అని అనిపించడం సహజం. ఎందుకంటే మా సినిమాలో కూడా హీరోయిన్ నయనతార కావడం. ‘విశ్వాసం’ లో కథంతా పాప టర్న్ తీసుకుంటుంది.
వాస్తవానికి అలాంటి కథతో ‘డాడీ’ వచ్చింది. నేను రిఫరెన్స్ గా తీసుకుంది చిరంజీవి గారి ‘డాడీ’ సినిమాని. ఆ కథని చిరు మార్క్ కామెడీతో తీసుంటే సూపర్ హిట్ అయ్యేది అనే థాట్ నాకు మొదటి నుండి ఉంది. అందుకే ‘ఆ సినిమా రిఫరెన్స్ తీసుకుని ‘మన శంకర వరప్రసాద్ గారు’ చేశాను” అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. మరి అనిల్ కామెంట్స్ తో ట్రోలర్స్ ఎంతవరకు కంట్రోల్ అవుతారో చూడాలి.