శ్యామ్ కె నాయుడు పై మరిన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి సుధా..!

  • June 3, 2020 / 08:15 PM IST

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు ‘తనని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి’ మోసం చేశాడని.. అతని పై ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టింది ‘అర్జున్ రెడ్డి’ నటి సాయి సుధా. ప్రస్తుతం ఈ కేసు పై ఎస్.ఆర్.నగర్ పోలీస్ లు విచారణ చేపట్టారు.ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఈ కేసు పెట్టడానికి గల కారణాలను వివరిస్తూ వస్తుంది నటి సాయి సుధా. వెంకటేష్ ‘బాడీ గార్డ్’ సినిమా టైములో శ్యాం కె నాయుడు తో పరిచయం ఏర్పడిందని చెప్పిన సాయి సుధా.. తరువాత ‘షాడో’ సినిమా టైములో కూడా కలిసి.. క్లోజ్ అయ్యామని చెప్పింది.

‘అదే సమయంలో శ్యామ్ ఈమెకు ప్రపోజ్ చేసాడని.. అయితే అతనికి ముందే పెళ్ళైంది అనే విషయం తెలీదని’ కూడా ఈమె తెలిపింది. ఓ రోజు ఆ విషయం తెలుసుకుని నేను శ్యామ్ ను నిలదియ్యగా… ‘తన భార్యతో గొడవలు ఉన్నాయని.. మేము విడిపోవాలనే డిసైడ్ అయ్యామని’ చెప్పాడని.. సుధా చెప్పుకొచ్చింది.అయితే ‘కొద్దిరోజుల తర్వాత నన్ను పెళ్ళి చేసుకోమని అడిగితే.. నాకు దూరంగా ఉంటున్నాడు.శ్యామ్ వల్ల శారీరకంగా.. మానసికంగా.. ఆర్థికంగా నేను నష్టపోయాను. నేను ఆయన ఖర్చులన్నీ భరించాను. సంపాదించుకున్న నా డబ్బంతా నష్టపోయాను. అది ఎంత అంటే చెప్పలేను… ప్రేమ వల్ల ఇవన్నీ లెక్కలేసుకోలేము కదా? ఫిజికల్ గా అలాగే ఎమోషనల్ గా అతనితో బాండింగ్ ఉంది.

అందుకే శ్యామ్ నాకు కావాలని కోరుకున్నాను. అందుకే ఇప్పుడు కేసు పెట్టాను. ఆయన వల్ల నష్టపోయిన నా డబ్బు కూడా నాకు కావాలి. కానీ శారీరక బంధానికి నష్టపరిహారం.. సెటిల్మెంట్ అంటూ వాటి కోసం నేను ఎదురు చూడటం లేదు. అతని వల్ల నా కుటుంబాన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఒంటరితనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ పెళ్ళైన వాడితో రిలేషన్ షిప్ ఎంత వరకూ కరెక్ట్ అని కాదు కానీ… అసలు అతని క్యారెక్టర్ ఎలాంటిదన్న విషయం తెలుసుకోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు’ అంటూ సుధా తన ఆవేదన వ్యక్తం చేసింది.


మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus