హాట్ ఫోజులతో హీటు పెంచుతున్న యాంకరమ్మ

సినిమాల్లో కంటే టీవీ షోల ద్వారా ఎక్కువ సంపాదిస్తుందని సినిమాలకి దూరమైపోయింది కానీ శ్రీముఖి కరెక్ట్ గా కాన్సన్ ట్రేట్ చేస్తే గనుక సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యే ఫిగర్ ఆమెది. అందం, అభినయ సామార్ద్యంతోపాటు కాస్త బోల్డ్ గా నటించగల సత్తా కూడా ఉన్న నటి శ్రీముఖి. ఆమె నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా విడుదలవ్వలేదు కానీ.. ఒకవేళ రిలీజ్ అయితే ఆ సినిమాలో శ్రీముఖి ఆరబోసిన అందాలు సెన్సేషన్ క్రియేట్ చేసేవి. అయితే.. ఆ అదృష్టాన్ని ఆమె అభిమానులు ఎలాగూ మిస్ అయ్యారు కాబట్టి వారికోసం శ్రీముఖి గత కొన్ని రోజులుగా వరుసబెట్టి హాట్ ఫోటోలు ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.

అసలే సూర్యుడి ప్రతాపం తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. ఆ సూర్యుడి తాపానికి మించి వేడికి తన సరికొత్త హాట్ ఫోటోలతో క్రియేట్ చేస్తూ మరింత తాపాన్ని తట్టి లేపుతోంది శ్రీముఖి.ప్రస్తుతం ఈటీవీ, జీటీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి.. సినిమాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం లేదని కాస్త గట్టిగానే చెప్పింది. అయితే.. తనను ఎగ్జయిట్ చేసే రోల్ వస్తే గనుక, అది కూడా లీడ్ రోల్స్ మాత్రమే చేస్తానంటోంది. ధనరాజ్ తో కలిసి నటించిన “ధనలక్ష్మి తలుపు తడితే” శ్రీముఖి నటించిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. మరి శ్రీముఖి అందాలను వెండితెరపై చూసే అదృష్టం ఆమె అభిమానులకు ఉందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఫోటోలు చూసి సంతృప్తి పడండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus