దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటెర్టైనర్స్ లో ‘కేరింత’ మూవీ కూడా ఒకటి. హీరో అడివి శేష్ కు కజిన్ అయిన సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2015 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో నిర్మాత యం.యస్.రాజు తనయుడు అయిన సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. తేజస్వి మాదివాడ,శ్రీ దివ్య వంటి వారు హీరోయిన్లుగా నటించారు.
కానీ అందరికీ గుర్తుండి పోయేది భావన అనే పాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ పాత్రలో నటించి మెప్పించింది సుకృతి అనే నటి.నటుడు పార్వతీశంతో కలిసి ఈమె చేసిన కామెడీకి థియేటర్లో ప్రేక్షకులతో నవ్వులు పూయించింది. అయితే ఈ మూవీలో నటించిన ఆమెకు ప్రశంసలు దక్కాయి కానీ.. తర్వాత ఈమె మరో సినిమాలో నటించలేదు. అందుకు గల కారణాలు ఈమె ఎప్పుడూ తెలియజేయలేదు. కానీ ఈమెకు తల్లి లేకపోవడంతో.. తండ్రి అన్నీ తానై పెంచాడట.
ఆయన మాట ప్రకారం.. సినిమాలు మానేసినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. సుకృతి ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలు, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఈమె పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు అక్షయ్ సింగ్. ఇదిలా ఉండగా.. పెళ్ళైన తర్వాత ఈమె తన లైఫ్ బాగుంది అన్నట్టు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ వీడియో, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!