చెన్నై బ్యూటీ త్రిష కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడంటే సైలెంట్ అయిపోయింది కానీ.. ఒకప్పుడు తన గ్లామర్ తో ఓ ఊపు ఒప్పేసిందనే చెప్పాలి. మొదట తరుణ్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ఎనక్కు 20 ఉనక్కు 18’ … తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ ‘వర్షం’ సినిమాలో నటించి స్టార్ డంని సంపాదించుకుంది.
ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలు ఈమెకు స్టార్ స్టేటస్ ను కట్టబెట్టాయి. 20 ఏళ్లుగా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది త్రిష. ఈ మధ్యనే ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రంలో ఈమె ఎంత అందంగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 40 ఏళ్ళ వయసొచ్చినా ఈమె ఇంత అందంగా ఉండడానికి గల కారణమేంటా అని.. అంతా ఆశ్చర్యపోతున్నారు.ముఖ్యంగా ఈతరం అమ్మాయిలు.
(Trisha) త్రిష 40 ఏళ్ళ వయసులో కూడా ఇంత అందంగా ఉండటానికి కారణం ఆమె ఫాలో అయ్యే స్ట్రిక్ట్ డైట్ అనే చెప్పాలి. త్రిష స్కిన్ టోన్ ఛామన ఛాయ మాత్రమే.అయితే ఆమె మొహంలో కళ ఉంటుంది. దానినే పెద్ద ఆయుధంగా చేసుకుంది త్రిష. ఈమె ఉదయాన్నే యోగాసనాలు చేస్తుంది. అటు తర్వాత పరాటాలు, లెగ్స్ తో వేసిన ఆమ్లెట్ లు ఎక్కువగానే తింటుంది. అవి ఉదయం పూట తీసుకునేది ఎనర్జీ కోసమేనట. ఆ తర్వాత ఈమె ఆరెంజ్ జ్యూస్ లేదా నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటుందట.
అందులో ఉండే విటమిన్ సి కోసం ఈమె రెగ్యులర్ గా వాటిని తీసుకుంటుందట. అందువల్ల ఫేస్ లో గ్లో కూడా పెరుగుతుందని ఈమె భావిస్తుంది. అలాగే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్.. వంటి వాటికి ఈమె దూరంగా ఉంటుంది. కేవలం హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుందట. ఔట్ డోర్ షూటింగ్ కు కనుక వెళ్తే.. పచ్చళ్ళు వాటిని తీసుకెళ్తుందట. ఆ టైంలో ఈమె ఎక్కువగా పప్పు, పెరుగన్నం మాత్రమే తింటుందట. ఇవే త్రిష గ్లామర్ సీక్రెట్ అనమాట.