సినిమా నటులపై ఎవరికైనా అభిమానం ఉంటుంది. వారి అభిమానానికి గుర్తుగా వారి ఫస్ట్ రోజు, ఫస్ట్ షో చూస్తారు. లేదా ఆ రోజు వారి కటౌట్లు ఏర్పాటు చేసి దండేస్తారు. ఇంకా చెప్పాలంటే వారి పుట్టినరోజునాడు అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ ఉంటారు. సినిమా నటులపై అభిమానులకు పీకలమీదిదాకా ప్రేమ ఉంటుంది. వారి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో కొందరు తాము అభిమానించే తారల కోసం ప్రత్యేకంగా గుడి కట్టారు. ఇలా ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్లు గుడి కట్టించుకున్నారో చూద్దాం.
ఖుష్భూ
అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ అంటే కొందరు పడి చచ్చేవారు. ఆమె సినిమాలను విడిచిపెట్టేవారు కాదు. తమ అభిమాన హీరోయిన్ ను ఫ్యాన్స్ ఎప్పటికీ ఆరాధించేవారు. అయితే ఆమె కోసం ఫ్యాన్స్ ప్రత్యేకంగా గుడి కట్టించారు. 1991లో ఖుష్బూ చిన తండ్రి సినిమా షూటింగ్ లో ఉండగా ఆమె కోసం అభిమానులు తిరుచ్చిలో టెంపుల్ నిర్మించారు. తన కోసం గుడి కట్టడం చూసి ఖుష్బూ షాక్ తిందట.
హన్సిక
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక తెలుగులో ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత పలు తమిళ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగారు. వారి అభిమానానికి గుర్తుగా చెన్నై శివారులో ఓ విగ్రహాన్ని తయారు చేసి ఆమె కోసం గుడి కట్టారు.
నమిత
తెలుగులో ‘సొంతం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తరువాత ‘జెమిని’ సినిమాతో ఫేమస్ అయింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరింగింది. ఈ సందర్భంగా ఆమెకు కోయంబత్తూరు, తిరునవెల్లితో పాటు మొత్తం మూడు గుళ్లు కట్టించారు.
నిథి అగర్వాల్
తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫేమస్ అయిన నిథి అగర్వాల్ కు తమిళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆమెకు చెన్నైలో గుడికట్టారు.
నగ్మా
1990లో హీరోయిన్ గా సంచలనాల సినిమాలు తీసిన నగ్మాకు తమిళంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. దీంతో ఆమెకు తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్లు ఆలయాలు నిర్మించారు.
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ నటించిన ఓ సినిమా కోసం తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఆలయం సెట్ వేయగా.. అందులో కొందరు అభిమానులు కాజలికి గుడి నిర్మించబోయారు. కాజల్ వారించడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
పూజా ఉమాశంకర్
ఇండో-శ్రీలంక నటి పూజా ఉమాశంకర్ ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించింది. ‘ఆరెంజ్’ లో అతిథి పాత్ర పోషించింది. ఈమెకు శ్రీలంకలోని కొలంబోలో అభిమానులంతా ఓ గుడి కట్టారు.
నయనతార
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్ నయనతారకు హీరోలకు ఉన్నంత ఫ్యాన్ డమ్ ఉంది. ఆమె కోసం ఓ గుడి కట్టాలని అభిమానులు నిర్ణయించుకోగా.. నయన్ దానికి నిరాకరించారు.
సమంత
సమంత (Actress) 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ యొక్క తెలుగు రొమాన్స్ చిత్రం ఏ మాయ చేసావేతో తను నటన రంగానికి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుకున్న సమంత. అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. తరువాత తెలుగు, తమిళ సినిమా అభిమానులను ఏ మాయ చేసిందో ఏమో గానీ అందరూ ఆమెకు అభిమానులు అయ్యారు. ఇటీవల కాలంలో సమంత కు ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చుండూరు గ్రామంలో ఓ అభిమాని రూ.6లక్షలు పెట్టి గుడి కట్టారు.