ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్.ఇక ఈ చిత్రం విజయంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాత్ర కూడా ఎంతో ఉంది అనడంలో సందేహం లేదు. సుమారు 13 ఏళ్ళ తరువాత ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె జీవించారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా క్లయిమాక్స్ లో తన కొడుకు చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఆమె ఇచ్చిన పెర్ఫార్మన్స్ అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం విజయంతో ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది అనుకున్న అభిమానులకి ఆమె పెద్ద షాక్ ఇచ్చింది.
ఆమె తన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ” ‘#సరిలేరు_మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 ‘కళ్ళుకుల్ ఇరమ్’ ,’కిలాడి కృష్ణుడు’ నుండి నేటి 2020 ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు.మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు.. మీ విజయశాంతి”… అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఆవిడ మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో ఆమె మరో చిత్రం చేసే అవకాశం లేదని స్పష్టమవుతుంది.
Most Recommended Video
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!