ఇప్పుడు బయట పరిస్థితులు ఏమీ బాగోడం లేదు. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోపక్క ఎండలు కూడా తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తున్నాయి. కొంతమంది డీ హైడ్రేషన్ తో మరికొంత మంది జలుబులు , జ్వరాలు.. వంటి వాటితో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు విశాఖ సింగ్. 2007లో వచ్చిన ‘జ్ఞాపకం’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇంకా చెప్పాలంటే వచ్చి వెళ్లినట్టు కూడా జనాలకు తెలీదు. దీంతో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది. అక్కడ ‘పిడిచ్చిరుక్కు’ అనే సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. అయినా ఈమె క్రేజీ హీరోయిన్ కాలేకపోయింది. ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పై ఉండటంతో వార్తల్లో నిలిచింది. ” నేను అనారోగ్యం పాలయ్యాను. త్వరగా కోలుకుంటాను. కొన్ని భయంకరమైన సంఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు నన్ను తరచుగా ఇబ్బంది పెడుతున్నాయి.
అయినా ఓ సంతోషకరమైన ఎండాకాలం కోసం సిద్ధం అవుతున్నా. ఏప్రిల్ లో ప్రతీసారి నాకు ఓ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. ఎందుకంటే అదే కొత్త ఆర్థిక సంవత్సరం కాబట్టి లేదా.. అది నేను పుట్టిన సంవత్సరం కావడం వల్ల కూడా కావచ్చు. ఎండాకాలపు రోజల కోసం.. ఆరోగ్యపు దృఢసంకల్పాల కోసం ముందుకు సాగుతున్నాను’’ అంటూ పేర్కొంది విశాఖ సింగ్.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!