ప్రస్తుత కాలంలో మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వచ్చిందంటే చాలు వెంటనే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు ఇలా మార్కెట్లోకి కొత్త మోడల్ కార్ ఏదైనా వచ్చింది అంటే తప్పకుండా ఆ కారు తమ గ్యారేజ్ లో ఉండాలని ఎంతో మంది సెలబ్రిటీలు భావిస్తూ ఉంటారు. ఇలా సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ రోవర్ గోల్డ్ కలర్ కారును కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కోసం మహేష్ బాబు ఏకంగా 5.5 కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా నటి యామి గౌతమ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఎన్నో తెలుగు తమిళ హిందీ సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తాజాగా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
లగ్జీరియస్ బీఎండబ్ల్యూ ఎక్స్7 కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కార్లు విక్రయించే డీలర్షిప్ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తమ బ్రాండ్ న్యూ కార్తో యామీ తన భర్త ఆదిత్య కలిసున్న ఓ స్టైలిష్ పిక్ని షేర్ చేశారు. ఇక ఈమె కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు రూ. 1.24 కోట్లని సమాచారం. ఇప్పటివరకు యామి గౌతమ్ వద్ద ఉన్నటువంటి కార్లలో అత్యంత ఖరీదైన కారు ఇదేనని తెలుస్తుంది.
ఇదివరకే యామీ గౌతమ్ (Yami Gautam) గ్యారేజ్ లో ఆడి ఏ4, ఆడి క్యూ7 కార్స్ ఉన్నాయి. ఇది ఖరీదైన మూడో కారు కావడం విశేషం ఇలా ఈమె ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఇతర సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమె తెలుగులో నువ్విలా గౌరవం కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి సినిమాలలో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.