నా లైఫ్ అంత బ్యూటీఫుల్ కాదు!

Advertisement

జరా షా అనే పేరు చెబితే అమ్మాయి ఎవరూ గుర్తుకు తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ.. “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” సినిమాలో ఆంధ్రా అమ్మాయిగా, నాగరాజ్ పాత్రకు జోడీగా నటించిన అమ్మాయి అంటే కాస్త గుర్తుపట్టొచ్చు. ఆ అమ్మాయి అనంతరం “భాయ్” సినిమాలో నాగార్జున సిస్టర్ గానూ నటించింది. అయితే.. “భాయ్” డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత అమ్మడికి సరైన అవకాశాలు లభించలేదు. దాంతో చాన్నాళ్లపాటు జరా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.

అయితే.. మళ్ళీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమ్మడు “ఐతే 2.0” అనే సినిమారో రీఎంట్రీ ఇచ్చింది. రేపు విడుదలవుతున్న ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా ఈ సినిమాని తనను హీరోయిన్ గా మళ్ళీ బిజీ చేస్తుందని ఆమె నమ్మకం. రాజ్ మదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించినవారందరూ కొత్తవారే కావడంతో ఈ సినిమా మీద పెద్దగా అంచనాలేమీ లేవు. కానీ.. సినిమా ఏమాత్రం బాగున్నా అందరికీ మంచి పేరొచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus