ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి డీసెంట్ హిట్ అందించిన మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే పీరియాడిక్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సైతం కీలక పాత్ర పోషించారు. అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ రూపొందించిన ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందించారు.
సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. గతేడాది నవంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ అన్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్లనో ఏమో కానీ… ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ సినిమా మరింత పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
నెట్ ఫ్లిక్స్ లో భారీ వ్యూయర్షిప్ ను సొంతం చేసుకుంది. ఇక ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 5.95 cr |
| సీడెడ్ | 1.06 cr |
| ఆంధ్ర(టోటల్) | 5.95 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 12.96 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.38 cr |
| ఓవర్సీస్ | 2.45 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 16.79 కోట్లు(షేర్) |
‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రానికి రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.25.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.16.79 కోట్ల షేర్ ను రాబట్టింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. దాదాపు రూ.8.71 కోట్ల నష్టాలతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.