Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న శర్వాకి ఇది కంబ్యాక్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సమ్మర్ కి ‘బైకర్’ అంటూ వచ్చాడు. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ దర్శకుడు సంపత్ నందితో ‘భోగి'(Bhogi) అనే పీరియడిక్ అండ్ మాస్ మూవీ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి కీలక పాత్ర పోషించింది.

Bhogi

ఇక దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ తో ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్..కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ట్రైలర్ కి మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో ధియేట్రికల్ బిజినెస్ అంతంత మాత్రంగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే టార్గెట్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  4 cr
సీడెడ్  2 cr
ఆంధ్ర(టోటల్)  5 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  11 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  2 cr
ఓవర్సీస్  2 cr
టోటల్ వరల్డ్ వైడ్ 15 కోట్లు(షేర్)

‘భోగి’ చిత్రానికి రూ.15 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. పెట్టిన బడ్జెట్ కి ఇది చాలా తక్కువే. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కోసం రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. తప్ప ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు కూడా లేవు అనే చెప్పాలి.

అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus