విమర్శకులపై విరుచుకుపడిన అదా శర్మ!

  • December 8, 2017 / 01:42 PM IST

హార్ట్‌ఎటాక్‌ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షులకు తెలిసిన అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ప్రతి రోజు ఏదోఒక పోస్ట్ తో అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఎప్పుడూ తనపై వచ్చిన విమర్శలను సైతం పాజిటివ్ గా తీసుకునే ఆమె తొలిసారి.. విమర్శకులపై విరుచుకు పడింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజులక్రితం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమాని అదాశర్మను చూసి..” ఓ ముద్దు ఇవ్వవా’ అని డైరెక్ట్‌గా అడిగేశాడు. ఆమె నవ్వేసి వెళ్లిపోయింది. దేంతో అతను వదలకుండా ‘సినిమాల్లో ముద్దుపెడతావు.

కానీ, నాకు పెట్టవా’ అంటూ అక్కడే, ఎయిర్‌పోర్ట్‌లోనే గట్టిగా కేకలు వేయడంతో.. ఆదా షాక్ కి గురయింది. ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో తొలి సినిమాలో ముద్దు అడిగితే ఇచ్చావు.. ఇప్పుడు ఇవ్వొచ్చుకదా? అని కొందరు కామెంట్స్ చేశారు. అందుకు  అదా శర్మ  గట్టిగా బదులిచ్చింది. ” ‘గత మూడేళ్లలో ట్విట్టర్‌లో ఎవరిపై నేను కోప్పడలేదు. కానీ, అభిమానికి ముద్దివ్వనందుకు కొందరు నాపై చేస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇవ్వాలనే ఇలా స్పందిస్తున్నాను. ఇది నా ఒక్కరి కోసం కాదు. ఆడపిల్లలందరి కోసం. ముద్దిస్తే పోయేదేముంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నా జీవితంలో ఏది చిన్న విషయం? ఏది పెద్ద విషయం? అని నిర్ణయించడానికి మీరెవరు? అలా చెప్పేందుకు మీకు ఏం హక్కు ఉంది.  అసలు నేను ఎవరిని ముద్దు పెట్టుకోవాలన్నది నా ఇష్టం. ఎవరో తెలియని వ్యక్తి నన్ను కలిసి ముద్దు ఇవ్వు అంటే.. అలాంటి వారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా. ‘హార్ట్‌ఎటాక్‌’ చిత్రంలో హీరోయిన్ పాత్ర అయిన ‘హయాతి’ ముద్దు ఇచ్చింది. ‘కమాండో 2’లో హీరోయిన్ పాత్ర భావనా రెడ్డి ముద్దు ఇచ్చింది.

అవన్నీ నేను ప్రదర్శించిన పాత్రలు. కానీ, నిజ జీవితంలో నేను వేరు. సినిమాలో ముద్దు పెట్టాను కదా అంటే అది సినిమా కాబట్టి, ఆ పాత్ర అక్కడ ముద్దు పెట్టాలి కాబట్టి పెట్టాను. ‘హార్ట్‌ఎటాక్‌’ చిత్రంలో నన్ను ముద్దు అడిగితే హీరోను కొట్టిన సన్నివేశం కూడా ఉంది. ఇలా సినిమాల్లో చేశామని, నిజ జీవితంలో చేసానా?” అని పెద్ద క్లాస్ తీసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus