కొత్త రోల్ కోసం కష్టపడుతున్న ‘హార్ట్‌ ఎటాక్‌’ బ్యూటీ

అదా శర్మ పేరు చెప్పగానే.. సినిమా అభిమానులు గుర్తుకు తెచ్చుకోవడానికి కాస్త టైమ్ తీసుకుంటారేమోగానీ.. నెటిజనులు మాత్రం వెంటనే ఈ బ్యూటీ గురించి చకచకా చెప్పేస్తారు. గత కొంతకాలంగా అదా శర్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఓసారి యోగా చేస్తూ.. మరో సారి బీచ్ లో అందాలు ఆరబోస్తూ.. రీసెంట్ గా కికి ఛాలెంజ్ వీడియోతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. దాదాపు పది సంవత్సరాల క్రితం ‘1920’ హిందీ సినిమా ద్వారా వెండితెరలోకి వచ్చిన ఈ జీరో సైజ్ సుందరి “హార్ట్‌ ఎటాక్‌” మూవీ ద్వారా తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటనకు ఫిదా అయినా హాలీవుడ్ చిత్ర పరిశ్రమ అవకాశం ఇచ్చింది.

తమ సినిమాలో కూరగాయలు అమ్మే మహిళగా నటించాలని.. వారు అలా చెప్పగానే ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేసింది. కట్టుబొట్టు అచ్చు గుద్దినట్టు కూరగాయల వ్యాపారిగా మారిపోయింది. డెమో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్లో ప్రత్యక్షం అయ్యాయి. ఇందులో అదా శర్మని చూసి అందరూ అవాక్ అవుతున్నారు. కనుక్కోలేకపోతున్నారు. అంతలా రెడీ అయింది. ఈ దెబ్బతో హాలీవుడ్ ఎంట్రీ ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు మన దేశ నటీమణుల్లో ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ రాధికా ఆప్టే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హాలీవుడ్‌ సినిమాల్లో మెరిశారు. ఆ జాబితాలోకి త్వరలోనే అదా శర్మ చేరనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus