Adipurush: ఆదిపురుష్ మూవీలో ఆ మార్పులు.. ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందా?

  • June 19, 2023 / 05:12 PM IST

ఆదిపురుష్ మూవీ విడుదలై మూడు రోజులు కాగా నెగిటివ్ టాక్ తో కూడా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే డబ్బులిచ్చి ఆదిపురుష్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ మూవీ రిలీజ్ రోజున మార్నింగ్ షో కూడా పూర్తి కాకముందే.

సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. ఎవరో కావాలని ప్రభాస్ సినిమాను టార్గెట్ చేసి ట్రోల్స్ చేయిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాపులర్ మీమ్స్, ట్రోల్స్ పేజ్ లు ప్రభాస్ సినిమాపై మరీ హద్దులు దాటి విమర్శలు చేయడం వల్ల ఈ సినిమాపై నెగిటివిటీ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ డైలాగ్స్ ను మార్చే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

త్వరలో ఆదిపురుష్ మూవీ కొత్త వెర్షన్ థియేటర్లలో త్వరలో ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది. నెగిటివ్ కామెంట్లను పరిగణనలోకి తీసుకుని మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఆదిపురుష్ మూవీ రేపటి నుంచి ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

రెండు రోజుల్లో 240 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండో రోజు కూడా ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని మేక్ర్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus