మళ్ళీ ప్రభాస్ పక్కన అదే హీరోయిన్ ఎందుకని పక్కన పెట్టారట..!

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తూనే మరో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. అందులో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చెయ్యబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకటి కాగా… మరొకటి బాలీవుడ్ ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ మూవీ కావడం విశేషం.! వీటిలో ‘ఆది పురుష్’ మూవీనే మొదట సెట్స్ పైకి వెళ్ళనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం.విలన్ రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ ఎంపికయ్యాడు.

అయితే సీత పాత్రలో ఎవరు నటించబోయేది ఇంకా నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంలో వారు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట. అయితే ఈ చిత్రంలో మొదటగా సీత పాత్రకు.. దీపికా పదుకొనెనే అనుకున్నారట. కానీ అప్పటికే ఈమెను ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల మూవీ కోసం సంప్రదించడంతో.. ‘ఆది పురుష్’ మేకర్స్ ఆమెను లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. అటు తరువాత కియారా అద్వానీ, అనుష్క శర్మ, ఊర్వశి రౌటేలా ..

ఇలా చాలా మంది పేర్లను పరిశీలించారట.మధ్యలో కీర్తి సురేష్ పేరుని కూడా పరిశీలించారని తెలుస్తుంది. కానీ ఇంకా ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదట. తెలుగుతో పాటు హిందీలో కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్ నే ఎంపిక చేసుకోవాలని ‘ఆది పురుష్’ టీం భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus