Siddharth, Aditi: ముంబై థియేటర్లో జంటగా సందడి చేసిన అదితి- సిద్ధార్థ్.. వైరల్ అవుతున్న డేటింగ్ రూమర్స్!

  • April 7, 2023 / 07:44 PM IST

సాధారణంగా ఒక సినిమాలో నటించిన నటీనటులు బయట పదేపదే కనుక కనపడుతూ ఉంటే వారిద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ఎంతోమంది సెలెబ్రెటీలు ఇలాంటి డేటింగ్ రూమర్లు ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటని చెప్పాలి. వీరిద్దరూ ఇదివరకే ఇతరులతో పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ జంటగా మహాసముద్రం అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి వీరిద్దరూ చాలా చనువుగా ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసి వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. ఇక సిద్ధార్థ్ అయితే ఈమె కోసం ఏకంగా చెన్నై వదిలి ముంబై వెళ్ళిపోయారు. ఇలా ముంబైలో వీరిద్దరూ షాపింగ్ మాల్స్ రెస్టారెంట్ థియేటర్స్ అంటూ జంటగా కనిపించడం వల్ల వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం గురించి నటి అదితిని పలుమార్లు ప్రశ్నించిన ఈమె సరైన సమాధానం చెప్పక ఈ ప్రశ్నను దాటవేశారు.

ఇకపోతే తాజాగా మరోసారి ఈ జంట థియేటర్లో కెమెరా కంటికి చిక్కింది దీంతో వీరిద్దరి గురించి వచ్చే డేటింగ్ రూమర్స్ నిజమేనని రుజువు అయింది అయితే వీరిద్దరూ కలిసి అదితి నటించిన జూబిలీ సిరీస్ ఈరోజు నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రీమియర్ షో వేయడంతో సిద్ధార్థ అదితితో కలిసి జంటగా వెళ్లారు. ఇలా వెళ్లడమే కాకుండా వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో వీరి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

నిజానికి ఈ సిరీస్ కు సిద్ధార్థకు (Siddharth) ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా ఈయన కేవలం అదితి కోసమే వచ్చారని తెలుస్తోంది. ఇలా మా ఇద్దరి మధ్య ఏమీ లేదంటూనే వీరిద్దరూ ఇలా జంటగా అన్నిచోట్లకు కలిసి వెళ్లడంతో వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. మరి ఎప్పటికైనా వీరి మధ్య ఉన్న బంధం బయట పెడతారా లేక ఇలాగే సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus