అడవి శేషు “కర్మ” అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా అడుగుపెట్టారు. కానీ హిట్ లభించక పోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. “పంజా”, “బలుపు”, బాహుబలి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, “రన్ రాజా రన్ తో” పాటు కొన్ని సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు. మళ్లీ “క్షణం”తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. హిట్ అందుకున్నారు. ఇక నుంచి హీరోగా కొనసాగడానికి మంచి కథకోసం ఇంతలా ఎదురుచూసారు. ఏడాది గ్యాప్ తీసుకొని చేసిన గూఢచారి సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అతను రాజమౌళి, పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడారు.
“కర్మ సినిమా చూసిన దర్శకుడు విష్ణువర్థన్, పవన్‌కల్యాణ్ నాకు “పంజా” లో అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో పవన్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే “బాహుబలి”లో నటించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాజమౌళి, పవన్‌లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. వారి వద్ద నేర్చుకున్న విషయాలు నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి” అని వెల్లడించారు. హీరోగా చేసిన రెండూ సూపర్ హిట్ కావడంతో సహజంగానే శేషు తర్వాతి ప్రాజక్ట్ పై ఆసక్తినెలకొని ఉంది.