పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా నటిస్తూనే … మరో పక్క యాడ్స్ చేస్తూ చాలా బిజీగా గడుపుతుంటాడు. అలాంటిది తాజాగా ఏ.ఎం.బి మల్టిప్లెక్స్ ని స్థాపించి వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. అంతేకాదు ‘జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్’ బ్యానర్ ను స్థాపించి … ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మహేష్ బాబు పూర్తి స్దాయి నిర్మాతగా మారి పెట్టి సినిమాలు చేయాలని భావిస్తున్నాడట.

అయితే మొదటగా.. తక్కువ బడ్జెట్ తో.. మిడిల్ ఆర్డర్ చిత్రాలు నిర్మించాలని అనుకుంటున్నాడట. ఇందులో భాగంగా …మొదట చిత్రాన్ని అడవి శేష్ హీరోగా నిర్మించబోతున్నాడట. ‘గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శశికిరణ్ తిక్క డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందనుందట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి ప్రొడక్షన్ భాధ్యతలను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ చూసుకుంటారట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తెలుస్తుంది. ఇక మహేష్‌బాబు ప్రస్తుతం తన 25 వ ‘మహర్షి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తయ్యిందట. మరో 2 వారాల్లో మిగిలిన షూటింగ్ కూడా పూర్తవుతుందని తెలుస్తుంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండగా.. అశ్వనీదత్‌, దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus