ఈషా పై అడవి శేష్ సీరియస్ అవ్వడానికి కారణం అదే..!

ఓ పక్క వైవిధ్యమైన పాత్రలు చేస్తూనే… మరో పక్క హీరోగా కూడా రాణిస్తున్నాడు అడవి శేష్. ‘దొంగాట’ ‘క్షణం’ ‘అమీ తుమీ’ ‘గూఢచారి’ వంటి విభిన్నమైన చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రేక్షకుల్లో కూడా అడివి శేష్ సినిమా అంటే కచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమానే అనే నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం ‘గూఢచారి 2’ (గూఢచారి సీక్వెల్) పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు రాజశేఖర్ కుమార్తె శివానితో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే… తాజా ఈ హీరో తన ‘అమీ తుమీ’ హీరోయిన్ ఈషా రెబ్బా పై సీరియస్ అయ్యాడట.

విషయంలోకి వెళితే… ఎప్పుడూ ట్వియిర్లో యాక్టివ్ గా ఉంటూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబందించిన విషయాల్ని… అలాగే తన కొత్త ఫోటోలని షేర్ చేస్తూ ఉంటాడు అడవి శేష్. ఇందులోభాగంగానే.. ‘ఫిబ్రవరి నెలాఖరున ఓ గుడ్ న్యూస్ చెప్తాను… ప్రస్తుతానికి అది సస్పెన్స్’ అంటూ ట్వీట్ చేసాడు. దీని కి ఈషా రెబ్బా స్పందిస్తూ… “ఏంటీ త్వరలో పెళ్లి కబురు ఏమైనా చెప్పబోతున్నావా” అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. దీనికి అడవి శేషు సీరియస్ ‘ఈమోజీ’ తో రిప్లై ఇచ్చాడు. దీంతో పెళ్ళికి సంబంధించిన ప్రకటన కాదని అనుకోవచ్చు. ఇదే సమయంలో నటుడు బ్రహ్మాజీ కూడా కామెడీగా స్పందిస్తూ.. “ఎంటీ అడవి శేష్ కి ఇంకా ళ్ళి కాలేదా” అంటూ తన దైన శైలిలో కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉంటే.. అసలు అడవి శేష్ చెప్పే గుడ్ న్యూస్ ఏమై ఉంటుందా అని అందరూ ఎదుచూస్తున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus