నటుడు అడివి శేష్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్న అతను నార్మల్ ఫీవర్ అనుకున్నాడట. అయితే ఆరోగ్య పరిస్థితిపై అనుమానం రావడంతో సన్నిహితుల సలహా మేరకు హాస్పిటల్ కు వెళ్లడం జరిగింది. ఇక హాస్పిటల్ లో వైద్యులు పరిశీలన అనంతరం అతను డెంగ్యూ బారిన పడ్డట్లు తెలుస్తోంది. అలాగే రక్త ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని సమాచారం. గత కొంతకాలంగా కొంత అస్వస్థతతో ఉన్న అడివి శేష్ సెప్టెంబర్ 18 న ఆసుపత్రిలో చేరాడు.
అతని పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. జ్వరం పూర్తిగా తగ్గేవరకు కూడా హాస్పిటల్ లో చికిత్స అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అడివి శేష్ మేజర్ షూటింగ్ అనంతరం రెస్ట్ తీసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేజర్ సినిమాతో పాటు అడవి శేష్ మరొక సినిమా కూడా చేస్తున్నాడు. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న టువంటి హిట్ సినిమా సీక్వెల్ లో కూడా అడివి శేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమాలతో బిజీ బిజీగా ఉండగా హఠాత్తుగా డెంగ్యూ వ్యాధికి గురయ్యాడు. ఆరోగ్యం విషయంలో చిత్ర నిర్మాతలు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. షూటింగ్ లను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అడివి శేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.