Actor Maanas: ‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

‘బిగ్ బాస్5’ కి 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు మానస్.ఈ రెండు వారాల్లో అతను ఎవ్వరినీ డిస్టర్బ్ చేయకుండా, ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకుండా చాలా కూల్ గా తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. హౌస్ లోకి వెళ్ళే ముందు హోస్ట్ నాగార్జునతో అతను అమ్మకూచి, అమూల్ బేబీ అనే విధంగా మాట్లాడినట్టు నాగార్జున చెప్పుకొచ్చాడు. హౌస్ లో ఎలా ఉంటాడా? కంగారు పడినట్టు కూడా నాగార్జున గతవారం చెప్పుకొచ్చాడు.అయితే అతను చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నట్టు కూడా ప్రశంసించాడు నాగ్. ఇది పక్కన పెడితే… మానస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

మానస్ పూర్తి పేరు మానస్ నాగులపల్లి. ఇతను పుట్టింది వైజాగ్ లో..! కానీ ఇతని తండ్రి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి కాబట్టి.. ఆయనకి చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ అవ్వడంతో మానస్ కూడా చిన్నప్పటి నుండీ అనేక ఊర్లు తిరుగుతూ వచ్చాడు. మానస్ తల్లిగారు కూడా టీచర్ గా ప్రిన్సిపాల్ గా చేశారు.

ఇతని విధ్యాబ్యాసం కూడా అలాగే రకరకాల ఊర్లలో జరిగింది. ముంబైలో ఇతను 2 వ తరగతి వరకు చదువుకున్నాడు.అటు తర్వాత వైజాగ్ శివ శివాని పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్నాడు..! అటు తర్వాత 10 వ తరగతి హైదరాబాద్ లో కంప్లీట్ చేసాడు. ఇంటర్ కూడా హైదరాబాద్ నారాయణ కాలేజీలో చేసాడు.బి.టెక్ గోకరాజు రంగరాజు కాలేజీ చేసాడు.

మానస్ కు చిన్నప్పటి నుండీ డ్యాన్స్ అంటే చాల ఇష్టం. చిరంజీవి గారి పాటలకు ఆయన్ని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేసేవాడు. అతని డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లకు గాను ఎన్నో ప్రైజ్ లు అందుకునే వాడు. అయితే ఇతను ప్రతీసారి ప్రైజ్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు అని.. ఇతను పార్టిసిపేట్ చేయకుండా కూడా కొంతమంది కుట్రలు చేసి తప్పించేవారట.

మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 10కి పైగా సినిమాల్లో నటించాడు. అతని పెర్ఫార్మన్స్ కు గాను ఎన్నో అవార్డులు కూడా పొందాడు.

బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నరసింహ నాయుడు’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మానస్. ఆ మూవీలో చిన్నప్పటి బాలయ్యగా కొన్ని నిమిషాల పాటు కనిపించాడు. అటు తర్వాత ‘వీడే’ ‘అర్జున్’ ‘సంభవామి యుగే యుగే’ వంటి చిత్రాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు.

అటు తర్వాత మానస్ చదువు డిస్టర్బ్ అవ్వకూడదని అతని తల్లిదండ్రులు కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంచారు.

ఇక మానస్ బి.టెక్ చదువుకుంటున్న టైములో అతనికి ‘ఝలక్’ అనే మూవీలో ఛాన్స్ లభించింది. ఆ మూవీ ఇతనికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.

అటు తర్వాత దర్శకుడు మారుతీ గారి బ్యానర్ అయిన ‘మారుతీ టాకీస్’ లో ‘గ్రీన్ సిగ్నల్’ ‘కాయ్ రాజా కాయ్’ వంటి చిత్రాల్లో నటించాడు.

అయితే కోయిలమ్మ, మనసిచ్చిచూడు(గెస్ట్),దీపారాధన(గెస్ట్), కార్తీక దీపం(గెస్ట్) వంటి సీరియల్స్ మానస్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

పెద్దయ్యాక మానస్ 7 సినిమాల్లో నటించాడు.అందులో ‘ప్రేమికుడు’ ‘గోలి సోడా’ ‘క్షీర సాగర మధనం’ అనే సినిమాలు కూడా ఉన్నాయి. ‘క్షీర సాగర మధనం’ అనే మూవీ గత నెలలో అంటే ఆగష్ట్ లో రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషిస్తున్న ‘wwwww'(5 డబ్ల్యూస్) అనే మూవీలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు మానస్. దాంతో పాటు ఓ వెబ్ సిరీస్ ను కూడా కంప్లీట్ చేసాడు.

Share.