Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » `మేజ‌ర్` లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు..!

`మేజ‌ర్` లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు..!

  • November 27, 2020 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`మేజ‌ర్` లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు..!

క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా `గూఢ‌చారి` ఫేం శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. కాగా ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు మేజ‌ర్‌లుక్ టెస్ట్ వీడియోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల‌చేశారు. ఈ వీడియోలో ‘మేజర్’ సినిమా ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాల‌ను అడివిశేష్ వెల్లడించారు.

అడవి శేష్ మాట్లాడుతూ.. ”మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ 2008 నుంచి నా మైండ్ లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు నేను యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నాను. అక్కడ న్యూస్ ఛానల్స్ లో 27వ తారీకు మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు. అప్పుడు సడెన్ గా ఆయన్ని చూసి ఎవ‌రు ఆయ‌న‌ అనుకున్నాను. చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్య లా అనిపించారు. ముఖ్యంగా ఆయన కళ్ళలో ఒక ప్యాష‌న్‌, స్పిరిట్ ఉంది. దాంతో ఆయ‌న ఎవ‌రు అని తెలుసుకోవాల‌ని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందుకే ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్ ను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంటర్వూస్ కంప్యూటర్ లో సేవ్ చేసుకుని చూసుకుంటూ ఉండే వాడిని. దాంతోనే పదేళ్లు గడిచింది. ఈ ప‌దేళ్లలో ఇండస్ట్రీలోకి రావ‌డం జ‌రిగింది. ఆయ‌న లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాని ఆయ‌న పేరెంట్స్‌ని కాంటాక్ట్ చేసే ధైర్యం ఎప్పుడూ రాలేదు. అయితే ఫైన‌ల్‌గా ‘మేజర్’ లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఉన్ని కృష్ణ‌న్ సందీప్ వాళ్ల ఫాద‌ర్‌ని కాంటాక్ట్ చేశాను.

పదేళ్లుగా నా కొడుకు లైఫ్ ని రీసెర్చ్ చేస్తున్నారా? నా కొడుకు లైఫ్‌ని ఇన్స్‌ఫైర్ అయ్యి ఒక సినిమా తీయాల‌నుకుంటున్నాడా? అని ఆయ‌న నమ్మలేదు. ఆ త‌ర్వాత బెంగులూరులో సందీప్ పేరెంట్స్‌ని క‌లిసి వారితో కొన్ని రోజులు గ‌డిపాను. ఆ స‌మ‌యంతో సందీప్ గురించి కొన్ని విష‌యాలు చెప్పారు. అలాగే రెండు మూడు సార్లు క‌లిసి వారితో మాట్లాడిన ‌తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని 10 శాతం నమ్ముతున్నాం అన్నారు. 0-10% వ‌చ్చామ‌ని ఆనంద‌ప‌డాలా? లేక ఇంకా 10%లోనే ఉన్నాం అని భాద‌ప‌డాలా? అర్ధం కాలేదు. కాని అప్పుడే ఈ సినిమా కచ్చితంగా చేయాలని మొండి పట్టు పట్టాను. సందీప్ పేరెంట్స్‌ని క‌లిసిన‌ప్పుడు వాళ్లు చెప్పిన ఫ‌స్ట్ విష‌యం ఎంటంటే మేజర్ సందీప్ గారి ఐకానిక్ పాస్ పోర్ట్ ఫోటో. ఆయ‌న నవ్వు ఆపుకుంటూ ఫోటో దిగారట. అయినా ఆయ‌న ఆ కళ్ళలో ఉన్న స్పిరిట్ మాత్రం షైన్ అయ్యింది అదే ఇన్నేళ్ళుగా న‌న్ను ట్రావెల్ అయ్యేలా చేసింది. ఒక సంద‌ర్భంలో సందీప్ అమ్మగారు నన్ను చూసి మా సందీప్ లానే క‌నిపిస్తున్నావు అన్నారు. ఆ క్ష‌ణం నాకు అర్ధ‌మైంది మేజ‌ర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయ‌డానికి వారి పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చింద‌ని. ఆ తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను. నా ఫ్రెండ్స్ అనురాగ్ శ‌ర‌త్ టీమ్‌తో మాట్లాడి అలాగే మహేష్ బాబు గారు మరియు సోని పిక్చర్స్ సహకారంతో తెలుగు, హిందీ భాష‌ల‌లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. ఆయ‌న లైఫ్ స్టోరి చెప్పాల‌నే ఉద్దేశ్యంతో గూఢ‌చారి డైరెక్ట‌ర్ శ‌శి కిర‌ణ్‌ని తీసుకొచ్చి ఆయ‌న‌తో డైరెక్ట్ చేయించ‌డం జ‌రిగింది. ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాస‌ఫి గుర్తొచ్చింది.

‘మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు’ అని లుక్ టెస్ట్ కి వెళ్లి ఆయ‌న స్పిరిట్‌ని నాలో నేను వెతుక్కుని మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా .. అంటూ ఒక ఫోటోని రివీల్ చేశాడు అడివిశేష్. అందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్ కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ పేస్ ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. దీనికి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫోటోను ఎలివేట్ చేసే విధంగా ఉంది. ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A+S Entertainments
  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #Major
  • #Major Sandeep Unnikrishnan

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

1 hour ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

2 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

3 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

3 hours ago
Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

4 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

4 hours ago
Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version