టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా తరువాత మహేష్ ఎలాంటి సినిమాలతో వస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో అయితే ఒక ప్రాజెక్ట్ సెట్టయ్యింది. అయితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది.
మహేష్ సినిమా కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిన ఒక్కడు సినిమాకు సీక్వెల్ రూపొందనున్నట్లు టాక్ వస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను ప్రముఖ నిర్మాత యంఎస్. రాజు నిర్మించారు. 2003లో విడుదలైన ఒక్కడు మహేష్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక 17ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ కు సంబంధించిన చర్చలు మొదలైనట్లు సమాచారం. అయితే నిర్మాత రాజు ప్రస్తుతం సిద్ధాంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మహేష్ అలాగే దర్శకుడు గుణశేఖర్ ఖాళీగా లేరు.
వారు మరో సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ మళ్ళీ గుణశేఖర్ తో వర్క్ చేస్తారా లేదా అనేది మరొక ముఖ్యమైన విషయం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.