ఆపద్బాంధవుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మీనాక్షి శేషాద్రి. అంతకు ముందు ఈమె బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో కూడా నటించింది. కొద్దిరోజుల నుండీ ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.1995 లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే 26 ఏళ్ల తర్వాత ఈమె తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ…
“అప్పట్లో నన్ను అంతా ఐస్ మైడెన్ (లేడీ ప్రవరాఖ్య) అనేవారు. అలా ఎందుకు అనేవరంటే నాకు అప్పట్లో బాయ్ ఫ్రెండ్స్ లేరు,ఎటువంటి అఫైర్లు కూడా లేవు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె చెప్పిన దాంట్లో నిజం లేదని అప్పటి జర్నలిస్టులను, ఆమె తోటి ఫిలిం సెలెబ్రిటీలను ఎవరిని అడిగినా చెప్తారు…అని కొంతమంది ఆరోపిస్తున్నారు.1980, 90లలో మీనాక్షి శేషాద్రి బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్. ఆమె సౌత్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె కెరీర్ మొత్తం బాలీవుడ్ లోనే సాగింది.
తన గ్లామర్ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన బ్యూటీ. డేటింగ్ వంటి వ్యవహారాలతో కూడా ఈమె నిత్యం వార్తల్లో నిలిచేది. అయితే రీ ఎంట్రీకి బాలీవుడ్ నుండీ,టాలీవుడ్ నుండీ సరైన సహకారం అందడం లేదని వినికిడి.