ఏడుస్తూ క్షమాపణలు చెప్పిన నటుడు!

  • December 15, 2020 / 03:38 PM IST

కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలు కన్నడనాట తీవ్ర కలకలం రేపాయి. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నటుడు విష్ణువర్ధన్ పై విజయ రంగరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. గౌరవం లేకుండా బూతులు తిట్టారు. విష్ణువర్ధన్ క్యారెక్టర్ ని తక్కువ చేస్తూ మాట్లాడారు. అతడికి ఆడవాళ్ల పిచ్చి ఉందని.. మంచి వ్యక్తి కాదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు విష్ణువర్ధన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కేవలం అభిమానులే కాదు.. కన్నడ స్టార్ హీరోలు సైతం విజయ రంగరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యష్, పునీత్ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర ఇలా చాలా మంది హీరోలు రంగరాజు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అతడు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక విష్ణువర్ధన్ ఫ్యాన్స్ అయితే విజయ రంగరాజుని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఫోన్లు చేసి మరీ హెచ్చించారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కన్నడ హీరోలు అన్నారు. ఆయన్ని అభిమానించే వ్యక్తులుగా ఈ వ్యాఖ్యలను సహించలేమని సుదీప్ స్ట్రాంగ్ గా చెప్పారు. టాలీవుడ్ లో కూడా విజయ రంగరాజుపై వ్యతిరేకత ఏర్పడింది. సీనియర్ నటుడు వీకే నరేష్.. విష్ణువర్ధన్ గురించి ఇలా అవమానకరంగా మాట్లాడడం తప్పంటూ ఒక వీడియో విడుదల చేశారు.

ఈ ఎదురుదాడిని తట్టుకోలేకపోయిన విజయ రంగరాజు.. బోరున ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. విష్ణువర్ధన్ అభిమానులకు, కన్నడ హీరోలకు, విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులకు కాళ్లు మొక్కి క్షమాపణలు చెబుతున్నానంటూ ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు. తను పెద్ద తప్పు చేశానని.. ఇకపై ఏ నటుడి గురించి ఇలా మాట్లాడనంటూ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus