అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెల 10 న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రారంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్, పాటలు రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే స్థాయిలో జరిగింది. దక్షిణాది సినిమాల్లో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను బాహుబలి 1, బాహుబలి 2, కబాలి, స్పైడర్ చిత్రాలు చేశాయి. ఈ జాబితాలో అజ్ఞాతవాసి చేరింది. విడుదలకు ముందే 156 కోట్ల బిజినెస్ చేసి పవన్ సత్తాని చాటింది. తెలుగు చిత్రాల విషయానికి వస్తే రెండో స్థానంలో నిలిచింది. అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు… (కోట్లలో)

నైజాం : 29
సీడెడ్ : 16.20
ఉత్తరాంధ్ర : 11.70
గుంటూరు : 9

ఈస్ట్ గోదావరి : 8.1
వెస్ట్ : 6.75
కృష్ణా : 7
నెల్లూరు : 4.05
ఎపి/తెలంగాణలో మొత్తం : 91.80
ఇతర రాష్ట్రాల్లో : 11.70
విదేశాల్లో : 19
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రైట్స్ : 122.50
శాటిలైట్ రైట్స్ : 32
ఆడియో హక్కులు : 2
ప్రీ రిలీజ్ బిసినెస్ మొత్తం : 156.50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus