ఇంట్లో చికిత్స పొందుతున్న ఐశ్వర్య రాయ్

  • December 7, 2016 / 12:34 PM IST

ప్రముఖ నటి జయలలిత మరణించిందని దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వారు బాధలో ఉంటే, నార్త్ ఇండియా సినీ అభిమానులు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కి ఏమైందని ఆందోళనలో ఉన్నారు. నిన్న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనే వార్తలు వారిని కలిచివేస్తున్నాయి. 2007 లో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని బిగ్ బీ అమితాబ్ కోడలిగా అడుగుపెట్టిన ఐశ్వర్య కొంతకాలంగా ఎటువంటి కలహాలు లేకుండా జీవనం కొనసాగించారు. వారి ప్రేమకు చిహ్నంగా ఆరాధ్య జన్మించింది. పాపకి ఐదేళ్లు రావడంతో ఐశ్వర్య మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టింది. కుర్ర హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో హాట్ గా కనిపించింది. అదే ఆమె కాపురంలో చిచ్చు పెట్టింది.

భార్య భర్తల మధ్య కొన్ని రోజులుగా సఖ్యత లేనట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం అభిషేక్ తో గొడవ పెద్దది కావడంతో ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిందని, కుటుంబ సభ్యులు అక్కడే ఉండడంతో ప్రమాదం తప్పిందని, వైద్యులను ఇంటికి రప్పించి ఆమెకు చికిత్స అందిస్తున్నారని ముంబై పత్రికలు నేడు కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలను ఐశ్వర్య వ్యక్తిగత సిబ్బంది పూర్తిగా ఖండించారు. ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని, భర్త అభిషేక్ తో ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. అందుకే ఈ రూమర్స్ పై బిగ్ బీ కుటుంబం మీడియా ముందుకు రాలేదని వెల్లడించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus