యువ కథానాయకుడు అఖిల్‌కి సరైన విజయం వస్తే బాగుండు అని కోరుకోని టాలీవుడ్ అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నా.. విజయం దక్కకపోవడంతో ఆయన అభిమానులతోపాటు, ప్రేక్షకులు కూడా ‘అఖిల్‌కి ఆ ఒక్క విజయం రావాలి’ అని కోరుకున్నారు. అలా వచ్చిన సినిమానే ‘లెనిన్’. చాలా ఆలస్యాలు, వాయిదాలు, డౌట్స్, మార్పులు చేర్పులు చేసుకుంటూ ఫైనల్లీ జులై 10న వచ్చి మంచి విజయం అందుకుంది.
అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు అఖిల్ నుండి కొత్త సినిమా అనౌన్స్ అవ్వలేదు. కానీ.. ఇప్పుడు ఆ సినిమా మళ్లీ రిలీజ్ అవుతోంది. అయితే అది జపాన్‌లో తెలుగు సినిమాలకు జపాన్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతోంది. కొంతమంది కథానాయకులకు, దర్శకులకూ అక్కడ అభిమనులు ఉన్నారు. అందుకే తరచూ తెలుగు సినిమాలు అక్కడ విడుదలవుతుంటాయి. అలా డిసెంబరు 11న ‘లెనిన్’ సినిమాను జపనీస్ భాషలో విడుదల చేస్తున్నారు.
అఖిల్ కథానాయకుడిగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మన దగ్గర విడుదలై రూ.వంద కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా జపాన్‌లో ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. మరిప్పుడు ‘లెనిన్’ సినిమాకు అలాంటి ఫలితమే రావాలి అంటే సామ ఫ్యాన్స్ యాక్టివేట్ అవ్వాలి. అదెవరు అనుకుంటున్నారా? ఇంకెవరు అఖిల్ తండ్రి.. ప్రముఖ హీరో నాగార్జున.
నాగ్‌ను జపాన్‌లో ఫ్యాన్స్ ‘నాగ్ సామ’ అని పిలుచుకుంటారు. అంటే లార్డ్ నాగ్ అని అర్థం. మొన్నామధ్య క్లాసిక్ సినిమా ‘శివ’ విడుదలైనప్పుడు సామ ఫ్యాన్స్ ఎంతగా జపాన్‌లో సందడి చేశారో చూడొచ్చు. ఇప్పుడు ‘లెనిన్’ సినిమాకు కూడా అలాంటి రియాక్షన్ రావాలి అంటే ‘సామ’ ఫ్యాన్స్ యాక్టివేట్ ఇవ్వాలి. ఇప్పటికే అఖిల్ సినిమా కోసం, పర్సనల్ ట్రిప్ కోసం జపాన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అయితే తన నెక్స్ట్ సినిమా చెబుతాడేమో చూడాలి అఖిల్.