Ajith: అజిత్ కొత్త సినిమా.. హీరోయిన్ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..
- July 15, 2026 / 03:06 PM ISTByFilmy Focus Desk
గత కొన్ని రోజులుగా అజిత్ విషయంలో కామ్‌గా ఉన్న తమిళ మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. అజిత్ 64వ సినిమా సంగతులు తెలియక కామ్‌గా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. దానికి కారణం సినిమా గురించి వస్తున్న వార్తల హడావుడే. అజిత్‌కి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి సినిమా ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ డైరక్షన్‌లో వస్తుండటమే. ఆ సినిమా ఆశించిన భారీ విజయం అందుకోకపోయినా.. అజిత్‌ను చూపించిన విధానం ఫ్యాన్స్‌కి నచ్చేసింది.
Ajith
మూడు Aలు కలసి చేస్తున్న ఈ సినిమాకు నిర్మాతగా అజిత్ ఉంటాడని నిన్ననే చదివి ఉంటారు. అయితే ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని చూసేది హీరోయిన్. ఆమె సినిమా హీరోయిన్ మాత్రమే కాదు.. అజిత్ లైఫ్‌లో కూడా హీరోయినే. అవును షాలినినే ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్ బాధ్యతల్ని చూస్తున్నారట. ఇప్పటికే సినిమా పనులు ఆమె స్టార్ట్ చేసేశారు అని అంటున్నారు. సినిమా ప్రారంభం సమయంలో ఈ విషయంలో మరికొంత క్లారిటీ వస్తుంది.

ఇక మరో టాపిక్ చూసుకుంటే ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. గ్లామర్, యాక్టింగ్ కలగలిపిన భామ కోసం చూస్తున్నారట. ఈ క్రమంలో లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆమెను ఈ విషయంలో కాంటాక్ట్ అయ్యారు సమాచారం. సినిమా ఓపెనింగ్ సమయంలో హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంటుందని చెబుతున్నారు.
మూడు Aలు కలసి రూపొందిస్తున్న సినిమా అన్నారు కదా.. ఎవరు అనే అనుకుంటున్నారా? ఇంకెవరు అజిత్, అధిక్, అనిరుథ్. అజిత్ లాంటి హీరోకు అనిరుధ్ ఎలాంటి సంగీతం ఇస్తారో చూడాలి. ఎందుకంటే అనిరుథ్ బ్యాగ్రౌండ్‌కి అజిత్ కటౌట్ ముందుకు నడుస్తుంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించేసుకుండి.











