Akhanda Hindi: పీక్ టైంలో రిలీజ్ చేసుంటే నార్త్ వాళ్లు బాలయ్య, బోయపాటికి గుడి కట్టేసేవాళ్లే..!

‘అఖండ’ హ్యాట్రిక్‌తో ‘సింహా’, ‘లెజెండ్’ లను మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ మూవీతో కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు బాలయ్య.. సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ బరిలో తన సింహగర్జన ద్వారా చూపించడమే కాక.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకొచ్చేాలా చేసి.. విడుదల వాయిదాలతో సతమతమవుతున్న తెలుగు చిత్రసీమకి సరికొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చారు..

అలాాగే మొన్నీమధ్య ఏపీలోని కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు.. ఓటీటీ, టీవీలో వచ్చినా కానీ.. ఫ్యాన్స్, ఆడియన్స్ థియేటర్లకి రావడం విశేషం.. ఇటీవల గోవాలో జరిగిన 53వ భారత అంతార్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (IFFI) లో.. మెయిన్ స్ట్రీమింగ్ పిక్చర్ కేటగిరీలో ‘అఖండ’ మూవీని స్క్రీనింగ్ చేశారు. బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొని రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.. ఈ సందర్భంగా ‘అఖండ’ కు సీక్వెల్ చేస్తామని బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే..

‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చెయ్యాలంటూ నార్త్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘అఖండ’ మూవీ.. ప్రౌడ్ ఫర్ సనాతన్ ధర్మ’’ అంటూ హిందీ వెర్షన్ రిలీజ్ చెయ్యాలని కోరారు.. దీని కోసం ఈ #WeWantAKHANDAInHindi హ్యాష్ ట్యాగ్ వాడాలంటూ ట్రెండ్ చేశారు.‘‘హిందీలో కనుక రిలీజ్ చేసుంటే ఈజీగా మరో 50 కోట్లు వచ్చేవి.. ఎందుకంటే కథలో యూనివర్సల్ అప్పీల్ ఉంది.. ప్రకృతిని, ప్రజలను, దేవాలయాలను కాపాడుకోవాలనే మెసేజ్ ఉంది

కాబట్టి అక్కడి వాళ్లకి కూడా బ్రహ్మాండంగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అనుకున్నదానికంటే ఎక్కువే పలికాయి’’ అంటూ సామాజిక మాధ్యమాలలో బాలయ్య ఫ్యాన్స్, మూవీ లవర్స్ డిస్కస్ చేసుకున్నారు. ఇంతకుముందు బాలయ్య సినిమాలు కొన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టాయి. ఇప్పుడు నార్త్ ప్రేక్షకులకు శివుడంటే అమితమైన భక్తి కాబట్టి ‘అఖండ’ చిత్రాన్ని హిందీలో చూడాలనుకుంటున్నారు..

కట్ చేస్తే.. ఇప్పుడు ‘అఖండ’ హిందీ వెర్షన్‌ను ప్రముఖ పంపిణీ మరియు నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది. తాజాగా హిందీ ట్రైలర్ వదిలారు.. తెలుగు ట్రైలర్‌కే హిందీలో డబ్బింగ్ చెప్పించారు.. శివుడు, పర్యావరణం వంటి అంశాలకు నార్త్ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.. జనవరి 20న ‘అఖండ’ భారీ స్థాయిలో విడుదల కానుంది..‘‘నార్త్ వాళ్లు ‘అఖండ’ హిందీ రిలీజ్ అవుతుంటే ఇంత ఎగ్జైట్ అవుతున్నారేంటి?.. పీక్ టైంలో రిలీజ్ అయ్యింటే హీరోకీ, డైరెక్టర్‌కీ గుడి కట్టేవాళ్లేమో’’ అంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus