Ashu Reddy: బాత్రూమ్ లో స్మోక్ చేస్తూ దొరికిపోయిన అషూ..! ఆ టైమ్ లో ఎవరూ చూడరని అలా చేసిందా..!

  • April 30, 2022 / 02:13 PM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఏది వైరల్ అవుతోంది. ఏది సైలెంట్ గా స్కిప్ అవుతోంది అనేది తెలియడం లేదు. మొన్న బిందు విషయంలో బాత్రూమ్ లొల్లి అయితే, ఈసారి రీసంట్ గా అషూ బాత్రూమ్ ఇష్యూ ఒకటి వైరల్ అవుతోంది. స్మోకింగ్ జోన్ లోకి వెళ్లి లైటర్ దొంగతనం చేసిన వీడియో ఆ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్లి దర్జాగా స్మోక్ చేసి వచ్చి, మళ్లీ మౌత్ ఫ్రెష్ నర్ వేస్కుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.

ఎందుకంటే, లాస్ట్ టైమ్ యాంకర్ శివని బాత్రూమ్ లో స్మోక్ చేస్తున్నాడంటూ క్లాస్ పీకింది అషూరెడ్డి. కానీ, ఇప్పుడు తనే చేసేసరికి నెటిజన్స్ అషూని ఒక ఆట ఆడుకుంటున్నారు. స్మోకింగ్ చేస్తే తప్పేంటి అని కొందరు అంటుంటే, ఆ స్మోక్ చేసేది ఏదో స్మోక్ జోన్ లో అందరూ చూసేలా చేయచ్చు కదా, ఇలా దాక్కుని కాల్చడం ఎందుకు అని అంటున్నారు. ఇక అజయ్ ఎలిమినేషన్ అయి వెళ్లేటపుడు అఖిల్ తో అషూని చూస్కో అని చెప్పింది దీనికోసమే అనుకుంటా అంటూ మాట్లాడుతున్నారు.

అషూరెడ్డి స్మోక్ చేసేటపుడు నటరాజ్ మాస్టర్, ఇంకా బాబాభాస్కర్ మాస్టర్ ఇద్దరూ బయట వాష్ రూమ్ దగ్గరే ఉన్నారు. అఖిల్ మాత్రం రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తూ స్మోకింగ్ వాసన రాకుండా చూసుకున్నాడు. అయితే, ఇక్కడే మార్నింగ్ నటరాజ్ మాస్టర్ లేవగానే, బాత్రూమ్ లో సిగరెంట్ కంపు కొడుతోందని, సిగరెట్ ఇంకా సెంట్ స్మెల్ కలిపి ఒకరకరమైన వాసన వస్తోందని బాబాభాస్కర్ కి చెప్పాడు. అంతేకాదు, అషూరెడ్డి స్మోక్ చేసిందనుకుంటా అంటూ గెస్ కూడా చేశాడు.

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు స్మోక్ చేయడం కొత్తేమీకాదు, ఫస్ట్ సీజన్ లో ముమైత్ ఖాన్ నుంచీ ఇది వస్తూనే ఉంది. ఇప్పుడు రీసంట్ గా తేజు డైరెక్ట్ గా స్మోక్ జోన్ లోకి వెళ్లి మరీ స్మోక్ చేసింది. అలాగే, సీజన్ 5లో హమీదా సైత్ స్మోక్ చేసింది కూడా. అయితే, ఇప్పుడు అషూరెడ్డి ఇంతలా బాత్రూమ్ లో స్మోక్ చేయాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేరేవాళ్లని కామెంట్ చేసే ముందు మనమేం చేస్తున్నామో చూస్కోవాలి అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఇక మార్నింగ్ 3గంటల సమయంలో అషూరెడ్డి లైవ్ లో ఎవరూ చూడరు అనుకుని ఇలా చేసి ఉండచ్చని కూడా చాలామంది అభిప్రాయ పడుతున్నారు. కావాలనే తెల్లవారుఝామున ఇలా చేసిందని, ఆ టైమ్ లో లైవ్ ఎవరూ చూస్తారులే అనుకుని ఉండచ్చని అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి అషూరెడ్డి బాత్రూమ్ లో స్మోక్ చేసిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదీ విషయం.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!


కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus