Yash: కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

2018 లో వచ్చిన డబ్బింగ్ సినిమా కే.జి.ఎఫ్ తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు యష్. అప్పటి వరకు ఇతను ఎవరో.. తెలీదు, ఇతని మొహం కూడా గతంలో చూసింది లేదు. రెండు మిడ్ రేంజ్ సినిమాల మధ్యలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలీదు. అయితే ఆ రెండు మిడ్ రేంజ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం వలన ఈ సినిమానే ఎగబడి చూశారు ప్రేక్షకులు. మౌత్ టాక్ పెద్ద ప్రమోషన్ అయ్యింది. దాంతో మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఓ కన్నడ సినిమా అంత కలెక్ట్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్. ఈ మూవీలో అతను చూపించిన యాటిట్యూడ్ కు, అతని మేనరిజమ్స్ కు ఫిదా అయిపోయారు.దానికి సీక్వెల్ గా వచ్చిన కే.జి.ఎఫ్2 కూడా ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే హీరో యష్ గురించి జనాలకి ఇప్పటికీ చాలా విషయాలు తెలీదు. అతని గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ కోసం:

1) యష్ అనేది ఇతని అసలు పేరు కాదు. నటుడు అయ్యాక ఇతను పేరు మార్చుకున్నాడు. ఇతని అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్.

2)యష్… 1986 వ సంవత్సరం జనవరి 8 న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు.

 

3) యష్… తండ్రి పేరు అరుణ్ కుమార్. ఈయన కె.ఎస్.ఆర్టీసీ డ్రైవర్.ఇతని తల్లి పేరు పుష్ప లతా. యష్ కు ఒక చెల్లెలు కూడా అంది. ఆమె పేరు నందిని.

4) యష్ విద్యాబ్యాసం అంతా మైసూర్‌ లో జరిగింది. కర్ణాటక,మైసూర్ లోని మహాజన ఎడ్యుకేషన్ సొసైటీ(MES) లో ప్రీ యూనివర్సిటీ కోర్స్(PUC) పూర్తి చేసాడు. .

5) యష్ చదువు పూర్తయ్యాక నాటక రచయిత బివి కరాంత్ చేత ఏర్పడిన బెనకా డ్రామా బృందంలో చేరాడు.ఇతనికి చిన్నప్పటి నుండీ నటనపై ఆసక్తి ఎక్కువ. అందుకే అతను ఆ దిశగా అడుగులు వేసాడు.

6) మొదట్లో యష్ స్టేజ్ షోలు వేసేవాడు. అటు తర్వాత ఈటీవీ కన్నడ లో ప్రసారమయ్యే ‘ఉత్తరాయణ’ అనే సీరియల్ ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించాడు. అటు తర్వాత నందా గోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివలలో వంటి సీరియల్స్ లో నటించాడు.

7) యష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఓ గాయకుడిగా..! అవును ఇతనిలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. అటు తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా, సహాయ నటుడిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.

8) ‘నంద గోకుల’ సెట్స్‌ లో ఇతనికి హీరోయిన్ రాధిక పండిట్‌ తో పరిచయం ఏర్పడింది. 2008 లో వచ్చిన ‘మొగ్గిన మనసు’ చిత్రంని శశాంక్ డైరెక్ట్ చేసాడు. ఈ మూవీలో యష్ కు జోడీగా రాధికా పండిట్ నటించింది. అటు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి 4 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరి పరిచయం కాస్త స్నేహం, అది కాస్తా ప్రేమ, పెళ్ళికి దారితీసింది. 2016 ఆగస్టు లో గోవాలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. 2016 డిసెంబర్ 9 న వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు.

9) 2013 లో వచ్చిన ‘గూగ్లీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రామచారి’ వంటి చిత్రాలు మంచి హిట్ అయ్యి యష్ హీరోగా నిలబడడానికి సహాయపడ్డాయి. 2017 లో ‘Yasho Marga’ అనే సంస్థని స్థాపించి కర్ణాటకలోని కొప్పల్ లో త్రాగు నీరు లేక ఇబ్బంది పడుతున్న ఏరియాలకి మంచి నీటిని సరఫరా చేయించాడు యష్.

10)’కె.జి.ఎఫ్’ ప్రాజెక్టుకి దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్ ను హీరోగా అనుకోలేదు. ముందుగా చాలా మంది హీరోలని సంప్రదించాడు. ఈ చిత్రాన్ని ఒక్కో భాషలో ఒక్కో హీరోతో తెరకెక్కించాలి అని అనుకున్నాడు. కానీ చివరికి ఇతనికి యష్ తగిలాడు. అతనితోనే సినిమా చేసి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసాడు. ఈ మూవీ యష్ ను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది. ఈ మూవీతో అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సౌత్ నుండే కాకుండా నార్త్ నుండీ కూడా యష్ తో సినిమాలు చేయడానికి దర్శకులు, నిర్మాతలు ఎగబడుతున్నారు. కానీ యష్ మాత్రం కన్నడ దర్శకులతోనే సినిమాలు చేయాలని చూస్తున్నాడు.

11) 2018 లో వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్1 మూవీ రూ.250 కోట్లను కొల్లగొట్టి కన్నడలో నెంబర్ 1 మూవీగా నిలిచింది.

12) ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. యష్ ను బిగ్గెస్ట్ మాస్ హీరోగా నిలబెట్టింది ఈ మూవీ..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus