వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే టాలీవుడ్లో చాలా క్రేజ్ ఉండేది. ఇక్కడి సినిమాలను పక్కన పెట్టి మరీ వాళ్ళ సినిమాలు చూసిన సందర్భాలు కూడా అనేకం.మన తెలుగు జనాలు కూడా బాష రాకపోయినా హిందీ పాటలనే ఎక్కువగా వినేవారు అంటే అక్కడి సినిమాల పై ఎంత మోజు ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికీ వింటూనే ఉన్నారు అనుకోండి అది వేరే విషయం.అలాగే మన స్టార్లకి కూడా బాలీవుడ్లో రాణించాలనే ఆశ ఉండేది. ఎందుకంటే ఇండియన్ సినిమాలకి బాలీవుడ్ అనేది పెద్ద మార్కెట్.అంతేకాదు అక్కడ పాపులర్ అయితే డబ్బుకి డబ్బు పేరుకి పేరు కూడా వస్తుంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ సక్సెస్ కాలేకపోయారు. ఇంకా ట్రై చేస్తే పరువు పోతుందని భావించి సైలెంట్ గా టాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు కాలం మారింది. బాలీవుడ్ సినిమాలు అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి. అక్కడి జనాలు కూడా వాళ్ళ సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పైగా మన సౌత్ సినిమాల డామినేషన్ కూడా ఎక్కువైంది. ‘బాహుబలి'(సిరీస్) తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాదు ఇక్కడి మేకర్స్ లో ఉన్న భయాన్ని కూడా పోగొట్టాడు అనే చెప్పాలి. ఇక రాజమౌళి స్పూర్తితో ప్రశాంత్ నీల్ కూడా ‘కె.జి.ఎఫ్’ తో బాలీవుడ్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ శంకర్ తర్వాత రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ గా ఎదిగారు. సుకుమార్ కు కూడా ఛాన్స్ ఉంది. అయితే దర్శకుల సంగతి ఓకె. మరి హీరోల సంగతి ఏంటి? అంటే ఇండియాలో నెంబర్ 1 అయ్యే సత్తా కూడా మన టాలీవుడ్ హీరోలకి ఉంది. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రభాస్ :

డౌట్ లేకుండా ప్రభాస్ ఇండియాలో నెంబర్ 1 హీరో అయ్యే అవకాశం ఉంది. అతని కటౌట్ కు తగ్గ సినిమాలు పడితే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వుద్ది.

2) అల్లు అర్జున్ :

స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక్కడి జనాలకే కాదు నార్త్ జనాలకి కూడా ఇతని సినిమాలంటే మోజెక్కువ. ‘పుష్ప 2’ కనుక హిట్ అయితే ప్రభాస్ ను మించి స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

3) ఎన్టీఆర్ :

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో కాదు ప్రమోషన్లతోనే అక్కడి జనాలకు చాలా దగ్గరయ్యాడు మన చిన రామయ్య. అనర్గళంగా హిందీలో మాట్లాడుతూ బి టౌన్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

4) రాంచరణ్ :

‘ఆర్.ఆర్.ఆర్’ తో రాంచరణ్ కు ముంబైలో భారీ క్రేజ్ ఏర్పడింది. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కనుక హిట్ అయితే అక్కడ స్ట్రాంగ్ గా నిలబడి ఏలే అవకాశం ఉంది.

5) రామ్ :

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు కూడా నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. ఒకసారి తన సినిమా అక్కడ రిలీజ్ అయితే ఈ విషయం ప్రూవ్ అవ్వుద్ది. కానీ రామ్ ఇంకా ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడం లేదు.

6) మహేష్ బాబు :

రాజమౌళి తో చేసేది పాన్ ఇండియా సినిమా అయితే మహేష్ బాబుకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎటువంటి పాన్ ఇండియా సినిమా చేయకుండానే బాలీవుడ్ స్టార్లకి కూడా ఇష్టమైన హీరోగా ముద్ర వేసుకున్నాడు.

7) రానా :

మన దగ్గుబాటి రానా కూడా కాన్సెంట్రేట్ చేయడం లేదు కానీ హిందీలో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. సొంతంగా తన సినిమాలను మార్కెట్ చేసుకోగల కెపాసిటీ కూడా ఇతనికి ఉంది.

8) పవన్ కళ్యాణ్ :

పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా ఆ రేంజ్లో వసూళ్ళు రాబట్టగల కెపాసిటీ పవన్ సినిమాలకి ఉంది. ‘హరి హర వీరమల్లు’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి.. అక్కడి జనాలు బాగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది.

9) రవితేజ :

మాస్ మహారాజ్ రవితేజ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకి వెళ్తుంటాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ కనుక హిట్ అయితే అది మరింత బలపడే అవకాశం ఉంది.

10) విజయ్ దేవరకొండ :

అర్జున్ రెడ్డి తో ఇండియా వైడ్ పాపులర్ అయిన హీరో. ‘లైగర్’ కనుక హిట్ అయితే ఇతనికి కూడా అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus