తన అన్న నాగచైతన్యను చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదుగానీ.. అక్కినేని మూడోతరం నటవారసుడు అఖిల్ కూడా ప్రేమలో పడి మునిగితేలుతున్నాడు. నిన్న “నేను ప్రేమలో ఉన్నాను” అని ఎనౌన్స్ చేసిన అఖిల్.. అన్నయ్య ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో.. ఇప్పుడు అమ్మాయి పేరు కూడా ప్రకటించేశాడు.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శాలిని భూపాల్ తనయ శ్రియ భూపాల్ తో అఖిల్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నాడు. శ్రియ ఒక ఫాషన్ డిజైనర్, మొన్న జరిగిన ఫిలింఫెర్ అవార్డు వేడుకలకు హాజరైన హీరోయిన్లలో సగం మందికి శ్రియ కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారానికి కూడా నాగార్జున ఒకే చెప్పాడని, అన్నీ కుదిరితే వీరి పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని వినికిడి!