కరోనా కష్ట కాలంలో చాలామంది సాయాలు చేశారు. వాటిని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం, వావ్ అనుకున్నాం. అయితే అలా బయటికొచ్చిన పేర్లు, వివరాలు చాలా తక్కువ. కొంతమంది చేసిన సాయం చెప్పుకోరు, ఇంకొన్ని బయటకు రావు. అలాంటి వారిలో అకీరా నందన్ ఒకరు. అవును పవన్ కల్యాణ్ తనయుడు గురించే ఇదంతా. కరోనా సమయంలో అకీరా చేసిన సేవల గురించి వివరాలు బయటికొచ్చాయి. చెప్పిందెవరో కాదు అతని స్కూల్ టీచర్లే.
అకీరా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల గ్రాడ్యుయేషన్ డే జరిగింది. అక్కడ అకీరా గురించి, అతని వ్యక్తిత్వం గురించి, తత్వం గురించి, అందించిన సేవలు గురించి స్కూల్ టీమ్ స్టేజీ మీద చెప్పింది. ఈ క్రమంలో అకీరా కరోనా సమయంలో చేసిన సేవల గురించి కూడా వివరించారు. వాటిని విన్న పవన్ ఫ్యాన్స్ తండ్రికి తగ్గ కొడుకు అకీరా నందన్ అంటూ మురిసిపోతున్నారు. పనిలో పనిగా పెదనాన్న లాగే సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు అకీరా అని చెప్పుకుంటున్నారు.
స్కూలు టీమ్ చెప్పినంత వరకు చూస్తే… అకీరా ఓ వేగన్. అంటే మాంసాహారం తీసుకోడు, దాంతో జంతువుల నుండి వచ్చే ఎలాంటి ఉత్పత్తులు ఆహారంగా తీసుకోడు. అంతేకాదు భూమ్మీద అన్నింటికి జీవించే హక్కుందని నమ్ముతాడు అకీరా. అందుకే వేగన్‌గా మారిపోయాడట. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్లను హాస్పిటల్‌కు డొనేట్ చేశాడు అకీరా. దాంతో ఆసుపత్రులకు అవసరమైన సాయం కూడా చేశాడు అని చెప్పారు స్కూట్ టీమ్.
టాలీవుడ్‌లో సాయం అంటే ముందుండే కుటుంబం మెగా ఫ్యామిలీ. ఈ విషయంలో ఇటీవల కరోనా సమయంలో మరోసారి తెలిసిందే. సీసీసీ ఏర్పాటు చేసి చిరంజీవి సినిమా వాళ్లకు అండదండగా నిలిచారు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ ఆయనకు అండగా నిలిచిందనుకోండి. పవన్ అయితే ఇలాంటి గుప్తదానాలు, అవసరాలకు సాయాలు చేస్తూ ఉంటాడు. రామ్‌చరణ్ కూడా అంతే. ఇప్పుడు వారి దారిలోనే అకీరా కూడా నడుస్తున్నాడు అన్నమాట. ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!