పాపం హీరోగా వరుస పరాజయాలు, విజయాన్నందుకోవడం పక్కనపెడితే.. అసలు కథానాయకుడిగా కనీస స్థాయి గుర్తింపు కోల్పోతున్న తరుణంలో తనను హీరోగా పెట్టి సినిమాలు తీస్తున్న దర్శకుల కంటే తనే బాగా సినిమా తీయగలను అనుకున్నాడో ఏమో కానీ ఉన్నట్లుండి హీరోగా సినిమాలు చేయడం మానేసి.. సడన్ గా డైరెక్టర్ అవతారం ఎత్తాడు రాహుల్ రవీంద్రన్. సుశాంత్ హీరోగా “చిలసౌ” అనే సినిమాకు శ్రీకారం చూట్టాడు. ఇలా కొత్త ప్రయాణం మొదలెట్టినప్పుడు “ఎందుకు ఈ కుర్రాడికి ఈ గోల అవసరమా?” అని నిరాశపరిచినవాళ్లే ఎక్కువ.
అలా తనను నిరాశపరచడానికి ప్రయత్నించినవాళ్లందరికీ ఒక టీజర్ తో సమాధానం ఇచ్చేశాడు రాహుల్. నిన్న విడుదలైన “చిలసౌ” టీజర్ అందర్నీ అద్భుతంగా ఆకట్టుకొంది. ఇక నిన్న విడుదలైన ఈ చిత్రానికి మంచి రిపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా సుశాంత్ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ కమ్ ఫిలిమ్ అంటూ విశ్లేషణలు రావడం.. హీరోయిన్ క్యారెక్టర్ & యాటిట్యూడ్ ప్రెజంట్ జనరేషన్ అమ్మాయిలందరూ ఓన్ చేసుకొంటుండడం, అన్నిటికీ మించి వెన్నెల కిషోర్ కామెడీ జనాలకి విశేషంగా నచ్చింది. ప్రారంభ వసూళ్లు అంతగా బాగోలేకున్నా.. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా వారాంతంలో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.