2006 లో వచ్చిన ‘ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అంజలి.. ఆ సినిమాతో ఎటువంటి గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అటు తర్వాత ‘బింబిసార’ దర్శకుడు హీరోగా నటించిన ‘ప్రేమలేఖ రాశా’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా జనాలకు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలీదు. ఈ క్రమంలో తెలుగులో ఈమెకు కలిసి రావడం లేదు అని భావించి.. తమిళ సినిమాల్లో ఛాన్స్ ల కోసం ట్రై చేసింది ఆ రాజోలు బ్యూటీ.
అక్కడ రెండు, మూడు హిట్లు కొట్టి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. అక్కడ వరుస ఆఫర్లు దక్కించుకుని దూసుకుపోయింది. అటు తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగులోకి ఈ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ తర్వాత తెలుగులో ఈమెకు వరుస ఆఫర్లు లభించాయి. అయితే అంజలి పెళ్లి వార్తలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు మరోసారి పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ గా నిలిచింది అంజలి. త్వరలో ఈమె తన తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందట. దీనిపై ఆమె క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ.. ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అంజలి.. రాంచరణ్ కు జోడీగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. అది పూర్తయిన వెంటనే పెళ్లి పీటలెక్కబోతుంది అంజలి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఔనని చెప్పలేం.