Baby: ‘బేబీ’ హిందీ రీమేక్ పై అల్లు అరవింద్ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ సినిమా ఈ ఏడాది జూలై 14 న రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటించిన ఈ చిత్రంలో వైష్ణవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అవ్వడంతో మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలకి తగ్గట్టే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది ఈ మూవీ. ముఖ్యంగా బి,సి సెంటర్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దాదాపు రూ.45 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా దాదాపు రూ.94 కోట్లు కొల్లగొట్టింది. కొన్నాళ్లుగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు కథనాలు వినిపించాయి. కానీ చిత్ర బృందం ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చింది లేదు.

అయితే ఈరోజు ‘కోట బొమ్మాలి పీఎస్’ టీజర్ లాంచ్ వేడుకలో అల్లు అరవింద్.. ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ‘ఎస్.కె.ఎన్ బాలీవుడ్ నిర్మాత కాబోతున్నాడు, బేబీ చిత్రాన్ని తాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు’ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే (Baby) హిందీ రీమేక్ లో ఎవరు హీరోలుగా నటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus