‘హిట్‌వర్స్‌’ నెక్స్ట్‌ సినిమాలో నిర్మాత కూడా!

  • November 22, 2022 / 02:57 PM IST

‘హిట్‌’ సినిమా ‘హిట్‌ వర్స్‌’గా మారుతున్న విషయం తెలిసిందే. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్‌’కి త్వరలో ‘హిట్‌ 2’ రాబోతోంది. త్వరలో ‘హిట్‌ 3’ కూడా రాబోతోంది. దీని గురించి ‘హిట్ 2’ సినిమా హీరో అడివి శేష్‌ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘హిట్‌ 3’ కేవలం ఆలోచన మాత్రమే కాదు.. ఆ సినిమాకు సంబంధించిన బౌండెడ్‌ స్క్రిప్ట్‌ కూడా రెడీ అయిపోయిందట. ఆ లెక్కన ‘హిట్‌ వర్స్‌’కి అంతా సిద్ధమైపోయింది అని చెప్పాలి.

‘హిట్‌’ సినిమాకు ఏడు సీక్వెల్స్‌ చేయాలని దర్శకుడు శైలేష్‌ కొలను, నిర్మాత నాని సిద్ధమయ్యారట. అందులో భాగంగా మూడో ‘హిట్‌’ని భారీ మల్టీస్టారర్‌ తీయాలని అనుకుంటున్నారట. దీని కోసం ఈ సారి ఏకంగా నానినే రంగంలోకి దిగుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. దీంతోపాటు ఓ కోలీవుడ్‌ విలక్షణ నటుడిని కూడా తీసుకొస్తున్నారని సమాచారం. ఆ లెక్కన ‘హిట్‌ 3’ పాన్‌ ఇండియా రేంజి సినిమా అని చెప్పొచ్చు అంటున్నారు. ‘హిట్‌ 2’ సినిమా రిలీజ్‌ తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

అంతేకాదు ‘హిట్‌ 2’ ఆఖరులోనే ‘హిట్‌ 3’ సినిమాలోని హీరో ఎవరో చెప్పేస్తారట. ‘హిట్‌వర్స్‌’ను దర్శకుడు శైలేష్‌ కొలను దేశంలో ఏడు కీలక నగరాల్లోని పోలీసుల నేపథ్యంలో తెరకెక్కిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. అలా ఆరు ‘హిట్‌’లు అయ్యాక.. ఏడో ‘హిట్‌’లో ఆ మొత్తం హీరోలను కలిపి మల్టీస్టారర్‌గా రూపొందించాలని చూస్తున్నారు. దీని కోసం దర్శకుడు ఇప్పటినుండే కథలు సిద్ధం చేస్తున్నారట. ఇవన్నీ అయ్యాక ఆఖరి కథను రాసుకుంటారని టాక్‌ నడుస్తోంది.

అయితే ‘హిట్‌ 2’ ఆఖరున కనిపించబోయే ఆ మూడో ‘హిట్‌’ హీరో నాని అని ఓ టాక్‌ నడుస్తోంది. అంటే మూడో ‘హిట్’లో నానినే హీరో అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే డిసెంబరు 2 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజే కేడీ అలియాస్‌ కృష్ణదేవ్‌ ‘హిట్‌ 2’తో థియేటర్లలోకి వస్తాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus