Allari Naresh: రాజేంద్ర ప్రసాద్‌ టైటిల్‌తో వస్తున్న యంగ్‌ హీరో… ఏ సినిమా అంటే?

  • December 30, 2023 / 08:11 PM IST

పాత సినిమా పేర్లను మళ్లీ వాడుకోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది హీరోలు ఇలా వాడి భారీ విజయాలు కూడా అందుకున్నారు. అయితే అప్పటి హీరోకు సరిసమానమైన ఇమేజ్‌ ఉన్న ఇప్పటి హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి వారిలో రాజేంద్రప్రసాద్‌ – అల్లరి నరేశ్‌ కూడా ఉంటారు. రాజేంద్రుడి సినిమాల్లో భారీ విజయం అందుకున్న సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇప్పుడు ఈ టైటిల్‌నే నరేశ్ వాడేస్తున్నాడు.

అలర్లి నరేశ్‌ తండ్రి ప్రముఖ దర్శకుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫక్తు కమర్షియల్‌ కామెడీకి దూరంగా, కాస్త మసాలా జోడించి రూపొందించిన సెటైరికల్‌ కామెడీ మూవీ అది. రాజేంద్ర ప్రసాద్‌, రంభ, రావు గోపాలరావు కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు సినిమాలకు బంపర్‌ హిట్‌ అంతే. ఇప్పుడు అదే టైటిల్‌ను నరేశ్‌ వాడుకుంటున్నాడట. ఈ మేరకు త్వరలో సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

శకుని పాత్రతో ఫేమస్‌ అయిన నటుడు సీఎస్ఆర్ వారసులు ఇటీవల కొత్త బ్యానర్ పెట్టి ఓ సినిమాను సినిమాను నిర్మిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయిందట. త్వరలో సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమాకే ‘ ఆ ఒక్కటీ అడక్కు’ అని పేరు పెడుతుననారని సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారట. అంతేకాదు ఆ ప్రకటన కూడా భారీగా ఉంటుంది అంటున్నారు.

ఇక అల్లరి నరేష్ (Allari Naresh) చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. నాగార్జునతో కలసి నటించిన ‘నా సామి రంగా’ సంక్రాంతికి రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత ‘బచ్చలమల్లి’ అనే మరో సినిమా ఇటీవల స్టార్ట్‌ చేశాడు. ఈ మూడు సినిమాలూ 2024లో రిలీజ్‌ అవుతాయట. వీటితోపాట నరేశ్‌ మరికొన్ని కొత్త కథలు వింటున్నాడట. తన స్పెషల్ జోనర్‌ అయితే కామెడీని ప్రధానంగా చేసుకుని రెడీ అయిన కథలకే ముందు ఓటేస్తున్నాడట. అలా అని అన్నీ అలాంటి కథలే వద్దు అని అంటున్నాడట.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus