దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారి చిన్న కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్.. మొదటి చిత్రంతోనే హిట్టు కొట్టి.. ఆ సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ సెంటిమెంట్ ను అప్పుడప్పుడు బ్రేక్ చేస్తూ ‘నేను’ ‘డేంజర్’ ‘పెళ్ళైంది కానీ’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘శుభప్రదం’ వంటి సినిమాలు చేశాడు. అయినా తన బలాన్ని వదల్లేదు.
కానీ ఇవివి సత్యనారాయణ గారు చనిపోయాక (Allari Naresh) నరేష్ కెరీర్ నత్త నడకలా సాగుతుంది అన్నది వాస్తవం. ‘మహర్షి’ నుండి రూటు మార్చి ‘నాంది’ వంటి సీరియస్ సినిమాలు చేస్తున్నప్పటికీ నరేష్ కు సక్సెస్ అంత ఈజీగా రావడం లేదు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ మే 10 కి అల్లరి నరేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇటీవల ‘ఉగ్రం’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో నరేష్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
1) బందిపోటు :
నరేష్ హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం రూ.3.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
2) జేమ్స్ బాండ్ :
నరేష్ హీరోగా సాయి కిషోర్ మచ్చ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.6.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
3) మామ మంచు అల్లుడు కంచు :
మోహన్ బాబుతో కలిసి నరేష్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.8.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.4 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
4) సెల్ఫీ రాజా :
నరేష్ హీరోగా జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.3.93 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
5) ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం :
అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.4.1 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.
6) మేడమీద అబ్బాయి :
నరేష్ హీరోగా జి.ప్రజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.6.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.3.4 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.
7) సిల్లీ ఫెలోస్ :
సునీల్ తో కలిసి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.4.5 కోట్లు షేర్ ను వసూల్ చేసి బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
8) బంగారు బుల్లోడు :
అల్లరి నరేష్ హీరోగా పి.వి.గిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ.4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.1.95 షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
9) నాంది :
నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.3.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి … రూ.5.13 కోట్లు షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
10) ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం :
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.4.35 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.2.24 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఉగ్రం సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్లో ఎంత రాబడుతుందో చూడాలి.