మహేష్ పై సంచలన కామెంట్స్ చేసిన అల్లరి నరేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 25 వ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోవాలని మహర్షి కోసం కష్టపడుతున్నారు. భరత్ అనే నేను వంటి హిట్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీలో క్లాస్, మాస్ అంశాలను మేళవించారు. రైతుల కష్టాలపై సాగే ఈ చిత్రం స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు డెహ్రా డూన్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన వంశీ నెక్స్ట్ షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేశారు. మహేష్ తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్న ఈ మూవీలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నారు. ఆ రోల్ ఏమిటో తెలుసుకోవాలని నరేష్ ని .. “ఈ సినిమాలో మహేశ్ కి పేదవాడైన ఒక స్నేహితుడిగా చేస్తున్నారట నిజమేనా?” అని అడగడంతో ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

“‘గమ్యం’లో నేను చేసిన ‘గాలి శీను’ పాత్ర అందరికీ ఎంతగానో కనెక్ట్ అయింది .. మహర్షిలో నా పాత్ర కూడా అలాంటిదే. ఈ సినిమా కోసం ఇప్పటికే మహేశ్ బాబుతో కలిసి 45 రోజుల పాటు ప్రయాణం చేశాను. మరో 100 రోజుల పాటు ఆయనతో కలిసి జర్నీ చేయవలసి ఉంటుంది. అక్టోబర్ నుంచి మళ్లీ షూటింగులో జాయిన్ అవుతాను. ఇంతకు మించి ఏమీ చెప్పొద్దని ఆల్రెడీ నాకు మహేశ్ బాబు వార్నింగ్ ఇచ్చాడు” అంటూ నవ్వేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించే పనిలో ఉన్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus