కామెడీ హీరోగానే మంచి క్రేజ్ ను పాపులర్ అయినప్పటికీ.. ‘అల్లరి’ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నప్పటికీ.. నరేష్ లో మంచి నటుడు కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘మహర్షి’ వంటి చిత్రాలతో అప్పుడప్పుడు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూనే వస్తున్నాడు మన అల్లరోడు. తన కంఫర్ట్ జోన్ లో ఓ మూడు కామెడీ సినిమాలు చేసినా.. ఒకటి నటనకు స్కోప్ ఉన్న సినిమాను చేస్తూ అభిమానులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్లనో లేక సినిమాలు తగ్గించడం వల్లనో కానీ ఈ మధ్యకాలంలో అతను కొంచెం డల్ అయ్యాడనే చెప్పాలి.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మరో కథా ప్రాధాన్యత కలిగిన సినిమాని చేస్తున్నాడు. దాని పేరే ‘నాంది’. ‘ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది అల్లరి నరేష్ కు 57వ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుండీ ఓ టీజర్ విడుదలయ్యింది. ఇప్పుడు మరో టీజర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ’15 లక్షల మంది చనిపోతేనే కానీ స్వాంతంత్య్రం రాలేదు, 1300 మంది ప్రాణత్యాగం చేస్తేనే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడలేదు.
ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భాలు చరిత్రలోనే లేవు’ అంటూ అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ లో వచ్చే డైలాగ్ చాలా ఇంటెన్సిటీతో కూడుకుని ఉంది. టీజర్ చాలా కొత్తగా ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.