టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఒక రకంగా చెప్పాలి అంటే చిరంజీవి ని మెగాస్టార్ గా మలిచే క్రమంలో గీతా ఆర్ట్స్ ప్రమేయం ఎక్కువగా ఉంది అని చెప్పక తప్పదు…అయితే సినిమా అంటే ఉన్న ఆసక్తి…సినిమాను ఎలా డీల్ చెయ్యాలో అన్న మ్యానేజ్మెంట్, కధపై అల్లు ఆరవింద్ కు ఉన్న పట్టు వెరసి…గీతా ఆర్ట్స్ టాప్ నిర్మాణ సంస్థగా మారింది…అదే క్రమంలో అల్లు ఆరవింద్ సైతం ఆ నలుగురు లో ఒకరిగా మారిపోయాడు…ఇదిలా ఉంటే….2016లో గేతా ఆర్ట్స్ ప్రభంజనానికి హద్దులు లేకుండా పోయాయి అంటే అతిశయోక్తి కాదు….విషయంలోకి వెళితే…2016లో సినిమాల రిసల్ట్స్ ఎలా ఉన్నా…గీతా ఆర్ట్స్ మాత్రం తీసిన అని సినిమాలు హిట్స్ తో మంచి రికార్డ్స్ నెలకొల్పింది…ఆ విషయాల్లోకి వెళితే…సమ్మర్ లో వచ్చిన అల్లు అర్జున్ మూవీ సరైనోడు.. గీతా ఆర్ట్స్ నుంచి ఈ ఏడాది వచ్చిన మొదటి సినిమా. అప్పటివరకూ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాకుండా…బన్నీ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం గమనార్హం….అదే క్రమంలో…ఆ తర్వాత అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో కూడా సక్సెస్ సాధించారు అల్లు అరవింద్.
శిరీష్ కెరీర్ ని గాడిలో పెట్టడమే కాదు మంచి ఫ్యామిలీ కధను అందంగా మలచి తెరక్కించి, ప్రేక్షకులను మంచి అనుభూతిని కలిగించారు….ఇక వాళ్ళిద్దరి సినిమాలు పక్కన పెడితే…ఏడాది చివర్లో….రామ్ చరణ్ ధృవతో కూడా సూపర్ హిట్ కొట్టాడు మన అల్లు ఆరవింద్….డీమానిటైజేషన్ తర్వాత వచ్చిన సినిమాల్లో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ ఒకటిగా ధృవ నిలిచిందంటే.. ఈ మూవీ సక్సెస్ అర్ధమవుతుంది. ఇక ఈ హిట్స్ అన్ని ఒక ఎత్తు అయితే, గీతాఆర్ట్స్2 అంటూ స్టార్ట్ చేసిన బ్యానర్ పై.. గతేడాది భలేభలే మగాడివోయ్ తీసి హిట్ కొట్టడమే కాకుండా….అదే సినిమాను కన్నడలో సుందరగణ రాజా అనే టైటిల్ పై రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నారు….అదీ మొత్తానికి గీతా ఆర్ట్స్ 2016 ప్రభంజనం…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.