మరి పవన్ కళ్యాణ్ “టీవి 9 & ఏబీయన్” న్యూస్ చానల్స్ కి ఎగైన్స్ట్ గా చేసిన యుద్ధంలో అల్లు అరవింద్ కీలకపాత్ర పోషించాడనో లేక మరింకేదో కారణమో తెలియదు కానీ.. టీవి9 కావాలని అల్లు అరవింద్ ను ఎవాయిడ్ చేస్తోంది. అందుకు మొన్న జరిగిన సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య సాక్షిగా నిలిచింది. ఈవెంట్ లో అందరి గెస్ట్ లు మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేసిన టీవీ9.. అల్లు అరవింద్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం మధ్యలోనే యాడ్స్ ప్లే చేయడం అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇదేమో మొదటిసారి కాదు టీవీ9 ఇలా చేయడం.. ఇదివరకు కూడా అల్లు అరవింద్ స్పీచ్ లను కావాలని కట్ చేశారు.
మరి యాజమాన్యం మారిన తర్వాత కూడా అల్లు అరవింద్ పై టీవి9కి ఎందుకు కోపం అని అడగొచ్చు. అయితే.. అక్కడ మారింది యాజమాన్యమే కానీ.. మనుషులు కాదు కదా. అల్లు అరవింద్ అంటే పడని వ్యక్తులు ఇంకా యాజమాన్యంలో భాగం అవ్వడమే అల్లు అరవింద్ స్పీచ్ కట్ అవ్వడానికి కారణం అని తెలుస్తోంది. మరి ఇలా అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ తో గొడవపడి టీవి9 లాంటి సంస్థ కానీ అందులోని ప్రధానమైన వ్యక్తులు కానీ ఏం సాదిద్దాం అనుకొంటున్నారో వాళ్ళకే తెలియాలి.